ప్రైవేట్ జెట్ కొనుగోలు చేసిన నయనతార?
తమిళంతోపాటు తెలుగు, హిందీల్లో కూడా సినిమాలు చేస్తూ నయనతార దూసుకెళుతోంది. తాజాగా ఆమె నటించిన మొట్టమొదటి హిందీ చిత్రం జవాన్ సంచలన విజయాన్ని సాధించింది. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచే రికార్డులు సృష్టిస్తోంది. నయనతార ఆస్తుల గురించి చర్చ జరిగింది. సోషల్ మీడియాలో ఆమె ఎంత ఆస్తిపరురాలు? అనే విషయం వైరల్ గా మారింది.
రూ.50 కోట్ల వ్యయం: ప్రస్తుతం ఆమెకు సంబంధించిన మరో వార్త వైరలవుతోంది. ప్రయివేటు జెట్ విమానాన్ని కొనుగోలు చేసిందని తెలుస్తోంది. దాని విలువ రూ.50 కోట్లు ఉంటుందని, దక్షిణ భారతదేశంలోనే ప్రైవేట్ జెట్ ను కలిగివున్న ఏకైక నటి నయనతారే అంటూ నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. నయనతార తమిళనాడు, కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లో ఆస్తులు కలిగివున్నారు. ఇటీవలే ఆమె దర్శకుడు విఘ్నేష్ శివన్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు.

అట్లీపై అసంతృప్తి : జవాన్ సినిమా విజయవంతం కావడంలో హీరోయిన్ గా నటించిన నయనతార పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే సినిమా విడుదలైన తర్వాత అతిథి పాత్రలో నటించిన దీపికా పదుకొనే పాత్ర హైలైట్ గా నిలిచిందంటూ వార్తలు వచ్చాయి. ఈ విషయంలో నయనతార తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. కథ చెప్పినప్పుడు ఒకలా, షూటింగ్ లో మరోలా, విడుదలైన తర్వాత సినిమాలో చూస్తే మరోలా ఉందని, అటువంటప్పుడు విషయాన్ని ముందే చెప్పాలికదా అని దర్శకుడు అట్లీని నిలదీసినట్లు తెలుస్తోంది. అట్లీ మొదటి సినిమా రాజారాణిలో కూడా నయనతార హీరోయిన్. తర్వాత విజయ్ తో తీసిన మూడు సినిమాల్లో ఒక సినిమాలో నయనతారే హీరోయిన్ గా చేసింది.












Click it and Unblock the Notifications