నయనతార కవల పిల్లల పుట్టిన రోజు.. తొలిసారిగా ఫోటోలు షేర్ చేస్తూ..
నటి నయనతార దక్షిణాదిలో ఎన్నో సినిమాల్లో నటించారు. లేడి ఒరియెంటెడ్ సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. నయనతార తాజగా నటించిన 'జవాన్' సినిమా ఎంత హిట్టయ్యిందో అందరికీ తెలుసు. ఈ సినిమా రూ.1000 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. సోషల్‌మీడియాలో అయితే, ఆ సినిమా పాటలు మిలియన్ల వ్యూస్‌ను దాటిపోయాయి. ఈ మధ్యకాలంలో సోషల్‌మీడియాకు దూరంగా ఉన్న నయనతార.. తాజాగా తన కవల పిల్లల పుట్టినరోజు సందర్భంగా కొన్ని అందమైన చిత్రాలను అభిమానులతో పంచుకున్నారు. దానికి సంబంధించి ఒక ఎమోషనల్ నోట్ కూడా రాసుకొచ్చారు. ఇంతకీ నయనతార పిలల్ల పుట్టినరోజు గురించి ఏం మాట్లాడుతుందో చూసేద్దాం.
నేనూ రౌడినే చిత్రంతో నయనతార - విఘ్నేశ్ శివన్ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఏడు సంవత్సరాలు ఈ ప్రేమ పావురాలు ప్రేమలో మునిగి తేలాయి. అలా జూన్ 9, 2022న మహాబలిపురంలో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్‌గా వీరి ఇద్దరూ ఒక్కటైనా సంగతి అందరికి తెలిసిందే. రాజకీయ పెద్దలు, సినీనటుల ఆశ్వీరాదాలతో ఈ జంట ఒక్కటయ్యింది. పెళ్లయిన కొద్ది నెలలకే అక్టోబర్ 22లోనే సరోగసీ ద్వారా నయనతార ట్విన్స్ కు జన్మనిచ్చారు. నయనతార ఇద్దరు కవలలకు తల్లిగా మారింది. అప్పటినుంచి నయనతార తన సమయాన్నంత పిల్లలను చూసుకునేందుకు ఎక్కువగా కేటాయించింది.


అందులో ఎప్పటినుంచి నా ఫ్యామిలి ఫోటోలు షేర్ చేయాలనుకుంటున్నాను. కానీ, అందుకు సమయం రాలేదు. కానీ, ఇప్పుడు ఆ సమయం వచ్చిందంటూ కవల పిల్లలకు పుట్టినరోజు విషెష్ చెబుతూ వారి అందమైన చిత్రాలను షేర్ చేసింది. గుణంలోనూ, రూపంలోనూ ఎంతో చక్కనివారంటూ కొడుకులను ఆకాశానికెత్తుతూ తన తల్లి ప్రేమను చాటుకుంది నయనతార. పిల్లల్ని మాటల్లో చెప్పలేనంతగా ప్రేమిస్తున్నామని, జీవితంలో నాకు అన్నింటికి మించిన ఆనందం వారేనంటూ పిల్లలపై తనకున్న ప్రేమను ఇలా మాటల్లో వర్ణించింది నయన.
ఇద్దరికీ ఓకే రకమైన డ్రెస్ వేసి ఎంతో క్యూట్ గా రెడీ చేసి, ఫ్యామిలీ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇంకా, వారు తమ జీవితంలోకి వచ్చినందుకు, చాలా సంతోషపరిచినందుకు ధన్యవాదాలు అంటూ ఉయిర్, ఉలగ్ ను మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకొచ్చింది. జీవితంలో అన్నీసానుకూలతుల, అందరీ ఆశ్వీరాదాలు వారికి అందాలని కోరుకుంది నయనతార.












Click it and Unblock the Notifications