వేణుస్వామితో జాన్వీకపూర్ పూజలు?

వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. ఆయన చెప్పినవాటిల్లో జరిగే వాటికంటే జరగనివే ఎక్కువ ఉంటాయి. నిత్యం ఏదో ఒక అంశంతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలవడం ఈయనకు అలవాటు. సమంత-నాగచైతన్య విడాకులు తీసుకుంటారని చెప్పిన విషయం ఒక్కటి మాత్రం జరగడంతో కాస్తంత పాపులారీటీ పెరిగిందని చెప్పొచ్చు. 100 విషయాల్లో 99 జరగకపోయినప్పటికీ ఒకటి జరిగితే చాలు.. ఈయనకు ఈయనే ప్రచారం చేసుకుంటారు. అటువంటి ప్రచార గిమ్మిక్కుల్లో మాత్రం ఆరితేరిపోయారు.

తారక్, చెర్రీ సరసన
తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరలవుతోంది. జాన్వీకపూర్ కూడా వేణుస్వామిచేత పూజలు చేయించుకోవాలనేది ఈ వార్త సారాంశం. ఎందుకంటే గతంలో రష్మిక పూజలు చేయించుకొని నేషనల్ క్రష్ గా మారింది. డింపుల్ హయతి, నిధి అగర్వాల్, అషురెడ్డి.. తదితరులంతా పూజలు చేయించుకున్నారుకానీ వారిస్థాయి మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనేరీతిలో ఉంది. జాన్వీకపూర్ ప్రస్తుతం దేవర చిత్రంలో నటిస్తోంది. అలాగే బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ చేయబోతున్న చిత్రంలో కూడా కథానాయికగా ఎంపికైంది.

Netizens advise to Janhvi Kapoor to perform pooja with Venuswamy

రాశిఫలాలు చూసుకుంటా
జాన్వీ జాతకాల గురించి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఉదయం లేవగానే రాశిఫలాలు చూసుకుంటానని చెప్పింది. జాతకం అనగానే ప్రతి భారతీయుడు ఆసక్తి చూపిస్తారు. తమ భవిష్యత్తు ఎలా ఉందో తెలుసుకోవాలనే ఆసక్తి వారిలో ఉంటుంది. వాస్తవానికి భవిష్యత్తు తెలిసింది భగవంతుడికి ఒక్కడికే. ఆయన్ను వదిలేసి అందరు దొంగస్వాముల దగ్గరకు ప్రజలు పరిగెడతారు. వారు చెప్పినవి చేస్తారు.. తర్వాత అలాగే వదిలేస్తారు. కష్టపడి ఫలితం దక్కించుకోవాలనే ఆలోచనతో ఉన్నవారు మాత్రం ఎటువంటి స్వాములను ఆశ్రయించారు. నెటిజన్లు ఈ విషయాలను గుర్తుచేస్తూ వేణుస్వామి దగ్గర పూజలు చేయించుకో.. నువ్వు కూడా నేషనల్ క్రష్ గా మారతావు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+