కొత్త సంవత్సరం వేళ.. దేవర నుంచి కొత్త పోస్టర్ రిలీజ్...
జూనియర్ ఎన్‌టిఆర్ అభిమానులకు కొత్త సంవత్సరం వేళ దేవర నుంచి క్రేజీ అప్‌డేట్ అందింది. దేవర సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. కొత్త సంవత్సరం నాడు దేవర నుంచి కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఎన్‌టిఆర్, రామ్‌చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.
ఆ సినిమా తర్వాత ఎన్‌టిఆర్ దేవర సినిమా చేస్తున్నారు. దేవరపై అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా అప్‌డేట్ కోసం ఎన్‌టిఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడ న్యూఇయర్ సందర్భంగా మూవీ మేకర్స్ మరో కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసి అభిమానులకు న్యూఇయర్ సర్‌ఫ్రైజ్‌ను ఇచ్చారు.

దేవర సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలు బాలీవుడ్ స్టార్స్ సందడి చేస్తున్నారు. అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ ఈ సినిమాలో ఎన్‌టిఆర్‌కు జోడిగా చేస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీఖాన్ విలన్ పాత్రను పోషిస్తున్నారు. ఆదిపురుష్ సినిమాలో సైఫ్ ఆలీఖాన్ విలన్ పాత్ర చేసి ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే.
దేవర సినిమాను రెండు భాగాలుగా తీసున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. దేవర మొదటి భాగం ఏప్రిల్ 5, 2024న విడుదల కానుంది. ఇప్పటికే ఇందులోని నటుల ఫస్ట్‌లుక్‌లను విడుదల చేశారు. ఇప్పడు తాజాగా న్యూ ఇయర్ కానుకగా కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్‌లో ఎన్టీఆర్ సముద్రం మధ్యలో నిల్చుని ఉండడం చూస్తాం. మరోవైపు 'దేవర' గ్లింప్స్‌ను జనవరి 08న విడుదల చేయనున్నట్లు మూమీ మేకర్స్ ప్రకటించారు.

టీజర్‌ను పండుగ నాడు రిలీజ్ చేసే ఆలోచన..
ఈ నెల 8న గ్లింప్స్ విడుదల చేసి, సంక్రాంతి పండుగ రోజున టీజర్ రిలీజ్ చేయాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు సమాచారం. అయితే, టీజర్ ఎప్పుడనే విషయాన్ని కూడా ఆ గ్లింప్స్‌లోనే అనౌన్స్ చేయొచ్చని సమాచారం. మార్చిలో టీజర్, రిలీజ్ టీజర్లను రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దేవర సినిమా మొత్తం సముద్రం బ్యాక్ డ్రాప్‌లో యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని టాక్.












Click it and Unblock the Notifications