నిహారిక షాకింగ్... 'తనను కనుగొన్నానని' పోస్ట్!
మెగా డాటర్‌గా తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన నిహారిక.. తగినంత గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. 2020లో చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకుంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అతని నుంచి విడిపోయింది. ఈ ఏడాదిలోనే విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని ఇద్దరూ అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుంచి కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టిన నిహారిక.. ప్రతిరోజు సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుంది. తన అందాలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. ఈ క్రమంలోనే ఒక్కోసారి ఈ అమ్మడు పెట్టే పోస్ట్‌లు ట్రోల్స్ అవుతుంటాయి. అయినప్పటికీ ఏ మాత్రం తగ్గని నిహారిక.. ట్రెండింగ్ ఔట్ ఫిట్‌తో మరింత రచ్చ చేస్తోంది.
నిహారిక సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టిన అది నిమిషాల్లో వైరల్ అవుతుంది. అంతేకాదు.. అది మరో రచ్చకు దారి తీస్తుంది. ఈ క్రమంలోనే నిహారిక పెట్టిన తాజా పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అన్న వరుణ్ తేజ్ పెళ్లిలో.. బావ వైష్ణవ్ తేజ్‌తో దిగిన ఫొటో షేర్ చేసింది. 'Hey You! నేను కనుగొన్నదాన్ని చూడండి' అంటూ ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ పెట్టింది. వైష్ణవ్ తేజ్‌కు తనకు మధ్యలో మంచి స్నేహ భావం ఉందని చాలా సందర్భాల్లో నిహారిక చెప్పింది.

వెబ్ సిరీస్ లు, సినిమాల్లో నటించిన నిహారిక తన గమ్యాన్ని మార్చుకున్నారు. పరిశ్రమలో నిర్మాతగా స్థిరపడాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగా ఇటీవలే కొత్త దర్శకుడి దర్శకత్వంలో ఒక చిత్రాన్ని ప్రారంభించారు. నిర్మాతగా స్థిరపడటానికి తన అన్న వరుణ్ తేజ్, వదిన లావణ్యత్రిపాఠి బాగా సపోర్ట్ చేస్తున్నారని చెప్పింది. భవిష్యత్తులో టీవీ సీరియల్స్ కూడా నిర్మించే ఆలోచన ఉందని, అలాగే వెబ్ సిరీస్ లు కూడా నిర్మిస్తామని వెల్లడించింది. నెటిజన్లు నిహారికికు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.












Click it and Unblock the Notifications