అర్ధరాత్రి హోటల్ భస్మీపటలం- 9 మంది దుర్మరణం

కోల్‌కతాలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఇక్కడి ఓ హోటల్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు తొమ్మిది మంది మరణించారు. ఆరుమందికి పైగా గాయపడ్డారు. వారిలో ఒకరిద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనే భయాందోళనలకు వ్యక్తమౌతోన్నాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చారు.

నగరంలోని ప్రీ స్కూల్ స్ట్రీట్‌లో ఉన్న హోటల్‌ ఇది. ఈ వేకువ జామున 1:45 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తొలుత దట్టమైన పొగ అలముకుంది. ఈ వెంటనే భగ్గుమంటూ మంటలు చెలరేగాయి. గాఢనిద్రలో ఉన్న వాళ్లు తేరుకుని బయటపడే లోపే అగ్నికీలలు హోటల్ మొత్తం వ్యాపించాయి. అక్కుడున్న ఫర్నిచర్, కర్టెన్లు, ఇతర వస్తువులు.. మంటలు త్వరగా వ్యాప్తిచెందడానికి కారణం అయ్యాయి.

Hotel Fire in Kolkata Leaves 9 Dead 6 Injured After Blaze Breaks Out More Deaths Feared Flames Doused

ఈ ఘటనలో ఊపిరాడక కొందరు, మంటల బారిన పడి మరికొందరు మరణించారు. మృతుల్లో ఒకరు బంగ్లాదేశీయుడు ఉన్నట్లు గుర్తించారు. అతను వైద్యం కోసం కోల్‌కతా వచ్చినట్లు తేలింది. సమాచారం అందిన వెంటనే అయిదు అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. భవనం అంతా దట్టమైన పొగ అలుముకోవడంతో లోపలికి వెళ్లడం అగ్నిమాపక సిబ్బందికి అత్యంత కష్టతరంగా మారింది.

అమెరికా పౌరసత్వ రికార్డుల తనిఖీ మొదలెట్టినట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన
అమెరికా పౌరసత్వ రికార్డుల తనిఖీ మొదలెట్టినట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన

నిచ్చెనల సహాయంతో పై అంతస్తులకు చేరుకోవడానికి కూడా సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. స్థానిక పోలీసులతో పాటు విపత్తు నిర్వహణ బృందాలు కూడా రంగంలోకి దిగి సహాయక చర్యలను పర్యవేక్షించాయి. ఈ మంటలు.. పక్కనే ఉన్న మరికొన్ని హోటళ్లు, వ్యాపార సముదాయాలకు కూడా మంటలు వ్యాపించడంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆరుమందిని సహాయక సిబ్బంది ఆసుపత్రికి తరలించారు.

మంటల బారిన పడ్డ హోటల్ కు పశ్చిమ బెంగాల్ ఫైర్ సర్వీసెస్ ప్రధాన కార్యాలయం సమీపంలోనే ఉండటంతో రెస్క్యూ టీమ్‌లు త్వరగా స్పందించేందుకు వీలైంది. ఈ ఘటనకు కారణాలేమిటనేది ఇంకా నిర్ధారించాల్సి ఉంది.

మంగళవారం సాయంత్రమే నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని పాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ భవనంలో మంటలు చెలరేగాయి. ఆ భవనంలోని మూడవ అంతస్తులో పొగలు రావడాన్ని గుర్తించిన సిబ్బంది సమాచారం అందించడంతో, రెండు ఫైర్ టెండర్లు వచ్చి మంటలను అదుపు చేశాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. విమాన సర్వీసులకు ఎలాంటి అంతరాయం కలగకలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+