ఎన్టీఆర్ - జాన్వీ కపూర్ రొమాన్స్ అదిరింది..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ''దేవర'' సినిమాలో నటిస్తున్నారు. ప్యాన్‌ ఇండియా మూవీగా 'దేవర'తెరకెక్కుతోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లా మోదకొండమ్మ పాదల వద్ద షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాతో జాన్వీ కపూర్ తెలుగు ఇండస్ట్రీకి పరిచియమవుతోంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలోని మొదటి పార్ట్‌ను దసరాకు విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. 'దేవర' మొదటి భాగం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆచార్య తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో దేవరపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సినిమాలోని టైటిల్ (ఫియర్) సాంగ్‌‌ను విడుదల చేశారు. టైటిల్ సాంగ్ సూపర్ హిట్‌గా నిలిచింది. యూట్యూబ్‌లో ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యధిక వ్యూస్ సాధించిన సాంగ్‌గా దేవర టైటిల్ సాంగ్ నిలిచింది. తాజాగా సినిమాలోని రెండో సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. 'చుట్టమల్లె చుట్టేస్తాంది తుంటరి చూపు.. ఊరికే ఉండదు కాసేపు, అస్తమానం నీ లోకమే నా మైమరపు, చేతనైతే నువ్వే నన్ను ఆపు' అంటూ సాగే మెలోడీ సాంగ్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది.

ntr devara 2nd song release

అనిరుధ్ నుంచి ఇలాంటి మెలోడి సాంగ్‌ను ఎవరూ ఊహించి ఉండరు. సాంగ్ అందర్ని ఆకట్టుకునేలా ఉంది. ఇక తెలుగులో తొలిసారి నటిస్తోన్న జాన్వీ కపూర్ తన అందాలను గట్టిగానే ప్రదర్శించినట్టు సాంగ్‌ను చూస్తే అర్థం అవుతోంది. తారక్-జాన్వీ కెమిస్ట్రీకి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఆడియో సాంగ్‌లో ఇంతలా ఉందంటే వీడియో సాంగ్‌లో జాన్వీ ఎంతలా రెచ్చిపోయిందో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

ఇక ఈ ఏడాదే ఎన్టీఆర్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వార్-2 సినిమాలో హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్‌లో కనిపిస్తారని సమాచారం. వార్-2తో పాటు మరో బాలీవుడ్ సినిమాకు కూడా ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ తీయబోయే కొత్త సినిమాలో ఎన్టీఆర్ ఎంపికైయ్యారని గుస గుసలు వినిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+