ముంబై పార్టీలో భార్యతో ఎన్‌టీఆర్...ఫోటోలు, వీడియోలు వైరల్..!
జూనియర్ ఎన్టీఆర్ తాజాగా తన సతీమణితో కలిసి ముంబై పార్టీలో మెరిసారు. ఎన్‌టీఆర్ తన మొదటి బాలీవుడ్ ప్రాజెక్టు వార్2 సినిమా షూటింగ్ కోసం బయలుదేరిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా ఎన్‌టీఆర్ కొన్ని రోజులుగా అక్కడే ఉంటున్నారు. తాజాగా ఎన్‌టీఆర్ ముంబై బాంద్రాలోని ఓ రెస్టారెంట్‌కి భార్యతో కలిసి డిన్నర్‌కి వెళ్లారు. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక, ఈ డిన్నర్ డేట్‌లో ఎన్‌టీఆర్ తన భార్యతో పాటు రణబీర్-అలియా భట్, హృతిక్ రోషన్, కరణ్ జోహార్లు కూడా ఉన్నారు.
ఇక డిన్నర్ ముగిసిన వెంటనే రెస్టారెంట్ నుంచి బయటికి వచ్చిన ఎన్‌టీఆర్‌ను ఫొటోగ్రాఫర్లు చుట్టుముట్టారు. ఈ ఫొటోలు, వీడియోలు ఇప్పడు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి. వార్ 2 సినిమా షూటింగ్ నిమిత్తం ఎన్‌టీఆర్ మొత్తం 60 రోజుల కాల్ షీట్స్ కేటాయించినట్టు తెలుస్తోంది. ఈ సినిమాను ఆగష్టు 14, 2025న న విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇందులో ఎన్‌టీఆర్ సీక్రెట్ ఏజెంట్‌గా కనిపించబోతున్నారు. అయితే తన లుక్‌ను సీక్రెట్‌గా ఉంచేందుకే ఎన్‌టీఆర్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఇటీవల మీడియా ఫొటోలు తీస్తుంటే వారిపై సీరియస్ అయ్యారు.

అక్టోబర్ 10 న థియేటర్లలో దేవర..
మరోవైపు తెలుగులో దేవర షూటింగ్ కూడా దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. ఇక, ఈ చిత్రాన్ని అక్టోబర్ 10న థియేటర్లోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఎన్‌టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్‌ను అందిస్తున్నారు. దేవర సినిమా రెండు భాగాలుగా రాబోతుంది. ఈ సినిమాలో ఎన్‌టీఆర్ రెండు పాత్రలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రీలీజయిన పోస్టర్లు మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నాయి. ఇక, ఎన్‌టీఆర్ చివరగా నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని అందించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో జూనియర్ ఎన్‌టీఆర్, రామ్‌చరణ్ గ్లోబల్‌స్టార్స్‌గా మారిపోయారు.
Fan Of His Fans 🙏#War2 @tarak9999 #JrNTR pic.twitter.com/sWYGMOnabk
— Jr NTR Fan Club (@JrNTRFC) April 29, 2024












Click it and Unblock the Notifications