ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం.. 'డ్రాగన్' షూట్ లో ఎన్టీఆర్..!!

ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఇరు దేశాలు ఒకదానిపై మరొకటి మిసైల్స్, డ్రోన్స్ తో దాడులు చేసుకుంటున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతికారంగా ఇరాన్ ఏకంగా 8 దేశాలలో ఉన్న యూఎస్ బేస్ క్యాంపులపై దాడులకు పాల్పడింది. ఈ దాడుల నేపథ్యంలో ఇరాక్, యూఏఈ, జోర్డాన్, ఇజ్రాయెల్ దేశాలు తమ గగనతలాన్ని పూర్తిగా మూసివేశాయి. మరోవైపు మధ్య ఆసియా పరిస్థితిపై భారత విదేశాంగశాఖ స్పందించింది. ఇరుపక్షాలు సంయమనం పాటించాలని భారత్‌ కోరింది. ఉద్రిక్తతలు తగ్గించేందుకు ప్రయత్నించాలని సూచనలు చేసింది.

ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో ఓ సంచలన వార్త చక్కర్లు కొడుతోంది. యంగ్​ టైగర్​ జూనియర్​ ఎన్టీఆర్- డైరెక్టర్​ ప్రశాంత్​ నీల్​​ కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్ మూవీ టీమ్ కు పెను ప్రమాదం తప్పిందనే చెప్పుకోవాలి. కొద్దిరోజుల క్రితం వరకు ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్ జోర్డాన్ లోనే జరిగింది. జోర్డాన్ షెడ్యూల్‌నే మూవీ టాకీ పార్ట్ పూర్తి అయినట్లు సమాచారం. దాంతోపాటు భారీ బడ్జెట్ సాంగ్ షూట్ కూడా చిత్ర యూనిట్ ఇక్కడే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే డ్రాగన్ చిత్ర యూనిట్ తీసుకున్న ముందస్తు జాగ్రత్తలు ఇప్పుడు అందరికీ ఊరటను కలిగిస్తున్నాయి.

అసలు డ్రాగన్ మూవీ షూటింగ్ మార్చి ఫస్ట్ వీక్ వరకు జోర్డాన్ లోనే జరగాల్సి ఉంది. కానీ అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను ముందుగానే అంచనా వేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ టీమ్.. ఫిబ్రవరి 22నే తమ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని భారత్ తిరుగు ప్రయాణం అయ్యారు. ఒకవేళ షూటింగ్ మరో 4 రోజులు ఆలస్యమై ఉంటే.. ఎన్టీఆర్ తోపాటు వందలాది మంది చిత్ర యూనిట్ అక్కడే చిక్కుకుపోయే ప్రమాదం ఉండేదని ఫిల్మ్ నగర్ వర్గాట టాక్. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ముందుచూపుతో ఎన్టీఆర్ టీమ్ క్షేమంగా హైదరాబాద్‌ కు చేరినట్లు తెలుస్తోంది. అటు ప్రస్తుతం ఎన్టీఆర్ సురక్షితంగా హైదరాబాద్ చేరుకోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

NTRDragon Shooting Completes in Jordan Film Unit Returns Safely as Israel-Iran War Escalates

ఇక డ్రాగన్ మూవీ 2026 జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రశాంత్ నీల్ తన దైన శైలిలో యాక్షన్ డ్రామాతో, ఎన్టీఆర్​ను తెరపై చూపించనున్నారు. ఈ మూవీలో ఎన్టీఆర్​ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్​ కథానాయికగా నటిస్తోంది. అంతేకాక బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+