భారీగా రెమ్యునరేషన్ పెంచిన ప్రభాస్... ఇండియాలో టాప్
డార్లింగ్, పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరంలేదు. ఎందుకంటే భారతదేశంలోనే ప్రస్తుతం అతను నెంబర్ వన్ హీరోగా చెలామణి అవుతున్నాడు. బాహుబలి సిరీస్ ఎప్పుడైతే ఘనవిజయం సాధించిందో అప్పటినుంచి దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాదిలో కూడా భారీ సంఖ్యలో అభిమానులు ఏర్పడ్డారు. దేశవ్యాప్తంగా ప్రభాస్ మానియా ఉందని చెప్పొచ్చు. అది ఎంతలా ఉందంటే డార్లింగ్ ఫ్లాప్ సినిమా కూడా రూ.350 కోట్ల వసూళ్లు చేస్తుండటంతో సినీ విశ్లేషకులు, ట్రేడ్ నిపుణులు ఆశ్చర్యపోతున్నారు.
అక్షరాల రూ.250 కోట్లు
బాహుబలి2 సినిమా దాదాపు రూ.1900 కోట్లు వసూలు చేసింది. ఆ సినిమా చేసే సమయంలో డార్లింగ్ పారితోషికం వేరు. దీనితర్వాత రూపొందిన చిత్రాలన్నీ భారీ బడ్జెట్ తో కూడుకున్నవే. సినిమా సినిమాకు రెమ్యునరేషన్ పెంచుకుంటూ వచ్చాడు. రూ.150 కోట్ల పారితోషికంతోపాటు లాభాల్లో వాటాలు తీసుకునేవాడు. అయితే అదంతా నిన్నటి వరకు. సందీప్ వంగా దర్శకత్వంలో తెరకెక్కబోతున్న స్పిరిట్, హను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకోబోతున్న చిత్రాల కోసం ప్రభాస్ అక్షరాలా రూ.250 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడు.

ఇండియాలోనే నెంబర్ వన్
ఇండియాలో ఇంతవరకు ఏ హీరో కూడా రూ.250 కోట్ల పారితోషికం తీసుకోలేదు. ఒక్క హీరోకే అంత పారితోషికం ఇస్తే ఆ సినిమా బడ్జెట్ ఎంతవుతుందో సులువుగా లెక్కించొచ్చు. ప్రభాస్ సినిమా కనీస బడ్జెట్ రూ.400 నుంచి రూ.500 కోట్లుగా ఉంది. సినిమా హిట్ అయిందంటేచాలు రూపాయికి మూడు రూపాయల లాభం వస్తోంది. అందుకే నిర్మాతలు ప్రభాస్ ఎంత అడిగినా ఇవ్వడానికి ముందుకే వస్తున్నారు. మున్ముందు మన డార్లింగ్ ఇంకెన్ని సంచనాలు సృష్టిస్తాడో చూడాలి మరి.












Click it and Unblock the Notifications