పవన్ కల్యాణ్, మహేష్‌బాబు వద్దంటే రవితేజ బ్లాక్‌బస్టర్ కొట్టాడు
సినిమా కథను తయారుచేసుకునే సమయంలో రచయిత, దర్శకుడు ఒక హీరోను దృష్టిలో పెట్టుకొని అతని బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా కథను తయారుచేయడంతోపాటు డైలాగులు కూడా రాస్తారు. కథ విన్న తర్వాత కాల్షీట్లు ఖాళీ లేకపోవడం లేదంటే కథ నచ్చక, మరే ఇతర కారణాలవల్లో ఆ హీరో చేయకపోతే అదే కథను పట్టుకొని ఆ దర్శకుడు మరో హీరో దగ్గరకు వెళతాడు. అతను ఓకే అంటే ఓకే. లేదంటే మళ్లీ ఇంకో హీరోను వెతుక్కోవడమే. సినీ పరిశ్రమలో ఇది సహజంగా జరుగుతుండేదే. ఇలాగే పవన్ కల్యాణ్, మహేష్ బాబు వద్దంటే ఆ కథతో రవితేజ సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.
ఇద్దరూ తిరస్కరించారు
అది ఏ సినిమా అంటే ఇడియట్. దర్శకుడు పూరీ జగన్నాథ్. ముందుగా వీరిద్దరి కాంబినేషన్ లో ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం వచ్చి మంచి హిట్ గా నిలిచింది. తర్వాత ఇడియట్ కథ రాసుకొని పూరీ పవన్ దగ్గరకు వెళ్లగా కథ నచ్చకపోవడంతో అతను సున్నితంగా తిరస్కరించాడు. దీంతో ఇదే కథను పట్టుకొని పూరీ మహేష్ బాబు దగ్గరకు వెళ్లగా తన బాడీ లాంగ్వేజ్ కు ఈ కథ సెట్ అవదేమో అనే సందేహంతోపాటు కథ కూడా నచ్చకపోవడంతో అతను కూడా సున్నితంగానే తిరస్కరించాడు. దీంతో పూరీ జగన్నాథ్ రవితేజను కలవగా అతనికి కథ బాగా నచ్చడంతో సినిమా వెంటనే పట్టాలెక్కింది.

బంపర్ హిట్ గా నిలిచింది
హీరోయిన్ గా రక్షిత నటించగా, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, సత్యనారాయణ, సంగీత తదితరులు నటించారు. పాటలు సూపర్ హిట్ అయ్యాయి. 2002లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చింది. 36 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. రవితేజ ఎనర్జీకి రక్షిత అందాలతోపాటు పూరీ డైలాగులు, చక్రి సంగీతం తోడవడంతో బంపర్ హిట్ గా నిలిచి రవితేజను ఈ సినిమా తిరుగులేని హీరోగా నిలబెట్టింది. దీనితర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో అమ్మ, నాన్న, ఓ తమిళ అమ్మాయి, నేనింతే సినిమాలు వచ్చాయి.












Click it and Unblock the Notifications