తెలంగాణ, ఏపీలో పుష్ప2 బాయ్‌కాట్..?

ఎప్పుడో, ఎక్కడో ప్రారంభమైన చిన్న వివాదం చిలికి చిలికి గాలివానలా మారడమేకాదు తుఫానులా మారింది. గతంలో అల్లు అర్జున్ మధ్య, రామ్ చరణ్ మధ్య ఎన్ని విభేదాలున్నప్పటికీ ఎన్నడూ బయటపడలేదు. ఏదో జరుగుతోందని తెలుసుకానీ ఆ విభేదాలు ఎందుకు వచ్చాయనే విషయంపై మాత్రం ఎవరికీ అవగాహన లేదు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప2 సినిమా చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దర్శకుడు సుకుమార్. అనేక వాయిదాలు, వివాదాల నేపథ్యంలో నెమ్మదిగా షూటింగ్ జరుపుకుంటోంది.

డిసెంబరు ఆరున వస్తుందా?
వచ్చే నెలాఖరుకల్లా పుష్ప2 సినిమా షూటింగ్ పూర్తయితేనే డిసెంబరు ఆరోతేదీన ప్రేక్షకుల ముందుకు రాగలుగుతుంది. అదే నెలలో గేమ్ ఛేంజర్ విడుదల కాబోతోంది. పవన్ కల్యాణ్ అభిమానులతో ఉన్న గొడవ వల్లే ఆగస్టు 15న విడుదల కావల్సి ఉన్న పుష్ప2 వాయిదా పడిదంటున్నారు. ఏపీ ఎన్నికల సమయంలో నాగబాబు చేసిన ట్వీట్ తో విభేదాలు బట్టబయలయ్యాయి. అవే వివాదాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఏపీ, తెలంగాణలో పుష్ప2 సినిమాను బాయ్ కాట్ చేయాలని పవన్ కల్యాణ్ అభిమానులు నిర్ణయించారు.

Pawan Kalyan fans have decided in Vijayawada to boycott the movie Pushpa 2 in AP and Telangana

వైసీపీ వాళ్లే చూస్తారులే
విజయవాడలో సమావేశమైన పవన్ కల్యాణ్ అభిమానులు దీనిపై చర్చ జరిపారు. మనకు, మన పార్టీకి మద్దతుగా లేనప్పుడు, పరోక్షంగా రాజకీయాలు చేస్తున్నప్పుడు మనం అతని సినిమాకు మద్దతివ్వడం అనవసరం కదా.. అతని సినిమాకు మనం మాత్రం ఎందుకు మద్దతివ్వాలనే అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైంది. తన సినిమాకు కలెక్షన్లు కావాలంటే వైసీపీ అభ్యర్థి దగ్గరకు వెళ్లిమరీ ప్రచారం చేశాడుకదా.. ఆ పార్టీవారే వచ్చి సినిమా చూస్తారు.. వారే కలెక్షన్లు తెచ్చిపెడతారు.. వారితోనే భారీ కలెక్షన్లు తెచ్చిపెట్టుకోవాలంటూ అల్లు అర్జున్ కు సవాల్ విసిరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+