త్రివిక్రమ్ పై పవన్ కల్యాణ్ ఫైర్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎటువంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయన సినిమాలతో పాటు రాజకీయంగా కూడా బిజీగా ఉంటున్నారు. సమయం దొరికినప్పుడల్లా సినిమా షూటింగ్స్ లో పాల్గొంటూ వాటిని పూర్తిచేస్తున్నారు. పవర్ స్టార్ తాజాగా నటిస్తున్న సినిమాల్లో ఓజీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాలో సగభాగం వేగంగా షూటింగ్ పూర్తిచేసుకున్నప్పటికీ మరో సగభాగం తీయడానికి అడ్డంకులేర్పడుతున్నాయి.
రాజకీయాల్లో చురుగ్గా ఉండటంవల్ల ఓజీ షూటింగ్ నెమ్మదించింది. పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ గా పవన్ కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ అంచనాలను భారీగా పెంచింది. సుజిత్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను డీవీవీ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా విషయంలో పవన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు వార్త వైరలవుతోంది. ఈ మధ్యకాలంలో పవన్ చేస్తున్న ప్రతి సినిమాకు త్రివిక్రమ్ ఇన్వాల్వ్మెంట్ కచ్చితంగా ఉంటుంది. బ్రో సినిమాలో కూడా త్రివిక్రమ్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడంతో చాలా సీన్స్ తీసేశారు.. దీంతో ఆ సినిమాకాస్తా ఫ్లాపైంది.

అనవసరమైన వాటిలో జోక్యం చేసుకోకుండా మీ పని మీరు చూసుకుంటే మంచిదంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. ఓజీ సినిమా విషయంలో కూడా మళ్లీ త్రివిక్రమ్ ఎక్కువగా జోక్యం చేసుకున్నాడంట. డైరెక్టర్ సుజిత్ కు ఇష్టం లేకపోయినా ఒకటి రెండు సీన్లలో మార్పులు చేయమని సూచించాడంట. ఇలా ప్రతి విషయంలో త్రివిక్రమ్ జోక్యం వల్ల సుజిత్ పై ఒత్తిడి ఎక్కువగా పడిందని, ఈ విషయాన్ని పవన్ తెలుసుకొని త్రివిక్రమ్ మీద ఫైర్ అయినట్లు సమాచారం. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంది తీసేయడం సరికాదని, ఏదైనా ఉంటే ముందే స్క్రిప్ట్ దశలో ఉండగా చెప్పాల్సిందని, ఇప్పుడు ఇలా చెప్తే ఎలా..? అంటూ పవన్ త్రివిక్రమ్ పై అరిచాడననే టాక్ సినీ వర్గాల నుంచి గట్టిగా వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications