మళ్లీ ఇన్నాళ్లకు ఓకే చెప్పిన పవన్ కళ్యాణ్.. కారణం అదే !
ఎన్నో ఏళ్ల చీకటికి పొద్దు పొడిచిందయ్యో ఇయ్యాలే.. అనే ఈ సాంగ్ లిరిక్ రీసెంట్ గా వచ్చిన యానిమల్ సినిమా లోనిది. ఆ పాట, ఆ సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా ఇప్పుడు అదే లిరిక్ ని తెగ వినేస్తున్నారు.. చెబుతున్నారు అనడంలో సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పవన్ కళ్యాణ్.. ఇన్నాళ్లు రాజకీయాల పరంగా అలుపెరగని యోధుడిలా దూసుకుపోతే.. ఇప్పుడు సినిమాల పరంగా స్పీడ్ పెంచారు.
పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రాల్లో 'OG', 'ఉస్తాద్ భగత్ సింగ్', 'హరిహర వీరమల్లు' ఉన్నాయి. ఎలక్షన్స్ లోపు ఆ సినిమాలు కంప్లీట్ కాకపోవడం.. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం చకచకా జరిగిపోయాయి. అయితే రీసెంట్ గానే 'OG', 'హరిహర వీరమల్లు' సినిమాలకు సంబంధించి షూటింగ్ లో పాల్గొన్నారు. అయితే మధ్యలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కి సింగపూర్ లో అగ్నిప్రమాదం జరగడంతో హుటాహుటిన అక్కడికి బయలుదేరి వెళ్ళడం.. రెండు రోజులు అక్కడే ఉండడం.. ఇండియాకి తిరిగి రావడం జరిగింది. దీంతో ఆ చిత్రాల షూటింగ్ కి బ్రేక్ పడింది.

అయితే తిరిగి మళ్లీ షూటింగ్స్ లో పాల్గొంటున్న పవన్ ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి తన వంతు కంప్లీట్ చేసేశారు. అలానే సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న "ఓజీ" మూవీ షూటింగ్ లో సైతం నిన్నటి నుంచి పాల్గొంటున్నారు. ఇక ఈ క్రమంలోనే "ఉస్తాద్ భగత్ సింగ్" సినిమాను సైతం మళ్లీ పట్టాలెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా.. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇన్ని రోజులు మిగిలిన సినిమాల గురించి ఒక అప్డేట్ అయిన ఇస్తున్నారు కానీ ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ఏ అప్డేట్ రావడం లేదు. దీంతో ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు వీటన్నింటికీ చెక్ పెడుతూ మూవీ షూటింగ్ మళ్లీ కొద్దిరోజుల్లోనే ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేశాడట హరీష్ శంకర్. ఓజీపూర్తి అయిన వెంటనే ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారట.
మొదట భవదీయుడు భగత్ సింగ్ అని ఈ మూవీని అనౌన్స్ చేయగా.. ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ గా మార్చారు. గబ్బర్ సింగ్‌తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో మళ్లీ సినిమా రాబోతుండడంతో భారీ అంచనాలు నెలకున్నాయి. వరుస ఫ్లాప్ లతో ఉన్న హరీష్ ఈసారి హిట్ కొట్టి అన్ని లెక్కలు సరిచేస్తారని భావిస్తున్నారు. మరోవైపు పవన్ ఈ చిత్రం కోసం ఏకంగా 170 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక పవర్ స్టార్ వరుసగా సినిమాలను ఫినిష్ చేస్తుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.












Click it and Unblock the Notifications