"హరిహర వీరమల్లు" సెన్సార్ రివ్యూ.. పవన్ కల్యాణ్ వన్ మ్యాన్ షో
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అనేక వాయిదాల తర్వాత, ఈ భారీ బడ్జెట్ చారిత్రక యాక్షన్ డ్రామా జులై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలను నెలకొల్పింది.
టీమ్ ఇప్పటికే ప్రమోషన్స్‌ను ముమ్మరం చేసింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను తారా స్థాయికి చేర్చింది. పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నడూ చూడని లుక్‌లో, శక్తివంతమైన బందిపోటు వీరమల్లుగా కనిపించి అభిమానులను ఉర్రూతలూగించారు. ఔరంగజేబు కాలంనాటి చారిత్రక నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రంలో, బందిపోటు వీరమల్లు కోహినూర్ వజ్రాన్ని తిరిగి భారతదేశానికి తీసుకురావడమే తన లక్ష్యంగా పని చేయబోతున్నట్టు ట్రైలర్ స్పష్టం చేసింది. ఇది దేశభక్తి, వీరోచిత పోరాటాల కలయికగా కనిపించడం ఆసక్తికరంగా మారింది.

ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ ప్రముఖ నటుడు బాబీ డియోల్ నెగటివ్ పాత్రలో (ఔరంగజేబుగా) కనిపించనున్నారు. వారి నటన సినిమాకు మరింత బలాన్ని చేకూర్చనుంది.
ఇక సినిమా టైటిల్ గురించి టీమ్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. "విష్ణువు, శివుడు కలిపిన అవతారం వీరమల్లు" అని చిత్రబృందం పేర్కొంది. ఇది పవన్ కళ్యాణ్ పాత్ర యొక్క శక్తి, దైవత్వాన్ని తెలియజేస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది.
తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సినిమా మొత్తం 2 గంటలా, 42 నిమిషాల 30 సెకన్ల నిడివిగా నిర్ధారించారు.సినిమా అద్భుతంగా వచ్చిందని సెన్సార్ బోర్డు సభ్యులు కితాబిచ్చారు. అలాగే పవన్ కల్యాణ్ వన్ మ్యాన్ షో చేశారని, ఈ సినిమాను ఆయన తన భూజాలపై మోశారంటూ సెన్సార్ సభ్యులు ప్రశంసలు కురిపించారు.
ఇక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జులై 20న నిర్వహించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. వైజాగ్‌లో జరగనున్న ప్రీ రిలీజ్‌కు ఈవెంట్‌కు ఉత్తర ప్రదేశ్ సీఎం ఆదిత్య నాథ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని తెలుస్తోంది. ఇలాంటి భారీ కథాంశం, అద్భుతమైన విజువల్స్, పవర్ స్టార్ నటనతో హరిహర వీరమల్లు బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications