ఇట్స్ అఫీషియల్: ఓటీటీలోకి 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఈ మూవీ ఉగాది కానుకగా మార్చి 19న విడుదలైంది. హరీష్ శంకర్, పవన్ కల్యాణ్ కాంబోలో గతంలో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ ఎలాంటి రికార్డుల్ని నమోదు చేసిందో మనందరికీ తెలిసిందే. ఈ మూవీ అప్పటివరకూ ఉన్న తెలుగు చలన చిత్ర రికార్డుల్ని తిరగరాసింది. అయితే ఈ క్రేజీ కాంబో మరోసారి రిపీట్ కానున్న నేపథ్యంలో ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకున్నారు.
అయితే 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ థియేటర్లలో ఆశించినంత విజయం సాధించలేదు. ఇక ఈ మూవీ తొలిరోజు బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్ల నెట్ వసూలు చేసినట్లు సమాచారం. అలాగే తొలి వీకెండ్ లో రూ. 80 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఆ తర్వాత మెల్లిగా కలెక్షన్స్ తగ్గాయి. అయితే ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా..? అని పవర్ స్టార్ ఫ్యాన్స్ తోపాటుగా సాధారణ తెలుగు సినీ అభిమానులు సైతం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి గుడ్ న్యూస్ అందింది.

'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ ఏప్రిల్ 16 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు తాజాగా నెట్ ఫ్లిక్స్ అధికారిక ప్రకటన చేసింది. ఇక ఈ మూవీలో పవన్ కల్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. అలాగే తమిళ నటుడు పార్తిబన్, అషుతోష్ రానా, నవాబ్ షా, చమ్మక్ చంద్ర, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు. ఇక ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అలాగే తమన్ బీజీఎం అందించారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేనీ, రవి శంకర్ సంయుక్తంగా నిర్మించారు.












Click it and Unblock the Notifications