విధ్వంసం మొదలు.. 'పెద్ది' పెను సునామీ వచ్చేసింది.. ఇదిదా బుచ్చిబాబు మార్క్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబోలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ 'పెద్ది'. ఈ సినిమా పీరియాడిక్ స్టోరీతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోంది. ఇటీవల రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ హీరో ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ రివీల్ చేశారు. ఈ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. గ్లింప్స్ లో రామ్ చరణ్ డైలాగ్స్ బాగున్నాయి. ఏదైనా నేలమీద ఉన్నప్పుడే చేసేయ్యాల.. మళ్లీ పుడతామా ఏంటి..? అన్న చెర్రీ డైలాగ్ ఆసక్తిని రేపుతోంది. గ్లింప్స్ చివర్లో రామ్ చరణ్ క్రికెట్ బ్యాట్ పట్టుకుని సిక్సర్ కొట్టే సీన్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తోంది. ఏప్రిల్ 06న శ్రీరామ నవమి సందర్భంగా పెద్ది మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

ఇక పెద్ది మ్యూజిక్ రైట్స్ ప్రముఖ సంస్థ టీ సిరీస్ (T Series) దక్కించుకున్నట్లు మేకర్స్ అధికారికంగా ఇటీవల వెల్లడించారు. అయితే ఎంత మొత్తానికి దక్కించుకుందోనని మాత్రం వెల్లడించలేదు.ఇక ఈ సినిమాలో ఓ సీక్వెన్స్ కోసం నెగిటివ్ రీల్ వినియోగించున్నట్టు రత్నవేలు గతంలో తెలిపారు. సన్నివేశం పూర్తిగా నేచురల్ గా ఉండేదుకు ఇలా చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇటీవల 'దేవర' సినిమాలోనూ కొంత మేర ఆ ప్రయత్నం చేశానని రత్నవేలు ఇంటర్వ్యూలో తెలిపారు.
A FIGHT FOR IDENTITY!! #RC16 is #Peddi.
— Ram Charan (@AlwaysRamCharan) March 27, 2025
A @BuchiBabuSana film.
An @arrahman musical.@NimmaShivanna #JanhviKapoor @RathnaveluDop @artkolla @NavinNooli @IamJagguBhai @divyenndu @vriddhicinemas @SukumarWritings @MythriOfficial pic.twitter.com/fuSN5IjDL1
పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సీనియర్ నటుడు జగపతిబాబు, కన్నడ స్టార్ శివ రాజ్‌కు మార్, దివ్యేందు లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలతో కలిసి వెంకట సతీశ్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications