'మీ అంతం చూసేంతవరకూ నేను బతికే ఉంటా'.. బీజేపీపై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..
బెంగాల్ రాజకీయాలు రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. బెంగాల్ లోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా ఎమ్మెల్యే మదన్ మిత్ర కూడా రెబల్స్ క్యాంప్ లో చేరడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు తృణమూల్ ఎంపీ, మమతాబెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కారణంగానే తృణమూల్ పార్టీలో రెబల్స్ పెరిగారని వస్తున్న వ్యాఖ్యలపై తాజాగా మమతా బెనర్జీ స్పందించారు. ఈ వ్యాఖ్యలను ఖండించారు. బీజేపీ కారణంగానే తమ నాయకులు పార్టీని వీడారని మండిపడ్డారు. మదన్ మిత్రా పార్టీని వీడిన కొద్ది సేపటికే మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ మేరకు పార్టీ మారిన ద్రోహుల తరఫున ప్రజలకు తాను క్షమాపణలు చెబుతున్నట్లు మమతా బెనర్జీ స్పష్టం చేశారు. తాను కానీ.. తన కుటుంబం కానీ పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదని తెలిపారు. నా ప్రత్యర్థులు(బీజేపీ) నాకు హార్ట్ ఎటాక్ రావాలని కోరుకుంటున్నారు. కానీ నేను మీ అంతం చూసేంతవరకూ బతికే ఉంటాను అని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీనియర్ టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్ర కూడా బుధవారం రెబల్స్ క్యాంప్ లో చేరడంపై దీదీ మాట్లాడుతూ వెళ్లాలనుకునేవారు వెళ్లొచ్చు అని పేర్కొన్నారు.
టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్రా తాజాగా మమతా బెనర్జీ శిబిరాన్ని వీడి రెబల్ క్యాంప్ నకు అధ్యక్షత వహిస్తున్న ప్రధాన ప్రతిపక్షనేత రితబ్రతా బెనర్జీ క్యాంప్ లో చేరారు. అభిషేక్ బెనర్జీ పార్టీ కార్యకలాపాల నుంచి ఆరు నెలలపాటు దూరంగా ఉండాలని తాను డిమాండ్ చేశానని తన డిమాండ్ ను అభిషేక్ బెనర్జీ పట్టించుకోలేదని అందుకే తాను మమతా బెనర్జీ శిబిరాన్ని వీడుతున్నట్లు తెలిపారు. తాను అసెంబ్లీలో గదిని మాత్రమే మార్చుకున్నానని పేర్కొన్నారు.

ఇక మదన్ మిత్ర తన క్యాంప్ ను వీడడంపై మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన భార్యతో పాటు ఇద్దరు కుమారులకు ఇటీవల ఈడీ సమన్లు పంపించారని అందువల్లనే ఆయన పార్టీని వీడారని తెలిపారు. ఈ నిర్ణయంతో అభిషేక్ బెనర్జీకి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. అలాగే నీట్ ప్రశ్నాపత్రం లీక్ పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్ చుక్ చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష పైనా మమతా బెనర్జీ స్పందించారు. ఈ మేరకు సోనమ్ వాంగ్ చుక్ కు మమతా బెనర్జీ సానుభూతి తెలిపారు. ఈ అంశంపై తాను సోనమ్ వాంగ్ చుక్ తో మాట్లాడినట్లు తెలిపారు.














Click it and Unblock the Notifications