గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు భారీ శుభవార్త.. ఇకపై నిమిషాల్లోనే డెలివరీ
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చుతున్నాయి. హార్మూజ్ జలసంధిలో ప్రపంచ దేశాల నౌకల రవాణాలో జాప్యం అవుతోంది. దాంతో భారత్ లోనూ చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తుతోంది. అటు గ్యాస్ సిలిండర్ డెలివరీలో సైతం తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ క్రమంలో గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఓ భారీ శుభవార్త అందింది.
భారత్ లోని ప్రముఖ క్విక్-కామర్స్ ప్లాట్ ఫామ్ గా పేరుగాంచిన స్విగ్గీ ఇన్ స్టామార్ట్, అలాగే భారత్ లో మొట్టమొదటి ఆన్- డిమాండ్ ఎల్‌పీజీ సిలిండర్ డెలివరీ సేవను తమ క్విక్-కామర్స్ ప్లాట్ ఫామ్ ద్వారా ప్రారంభించేందుకు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ పీసీఎల్)తో తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది. దాంతో స్విగ్గీలో ఇతర ఆహార పదార్థాలు డెలివరీ అయినట్టే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ కూడా నిమిషాల్లోనే డెలివరీ కానుంది. ఈ సేవలను మొదటగా మెట్రో పాలిటన్ నగరం, కర్ణాటక రాజధాని అయిన బెంగళూరులో ప్రారంభించారు.

అయితే సాధారణంగా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవడానికి ఉండే రూల్స్ కాకుండా.. ఈ యాప్ ద్వారా ఆర్డర్ చేయడానికి వినియోగదారులకు ముందస్తుగా ఎలాంటి డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్ ఉండాల్సిన పని లేదని సమాచారం. ఈ ఒప్పందంలో భాగంగా హెచ్ పీసీఎల్ నూతన 'HP నవ్య' 10 కేజీల కాంపోజిట్ LPG సిలిండర్ ఆవిష్కరణకు నాంది పలికింది. వీటితోపాటు సాధారణ 5 కిలోల మెటల్ సిలిండర్లు కూడా ఇన్ స్టామార్ట్ యాప్ లో లభ్యం అవుతాయి.












Click it and Unblock the Notifications