Sheikh Hasina: షేక్ హసీనాకు బంగ్లాదేశ్ సర్కార్ ఆహ్వానం..! బంపర్ ఆఫర్..!
రెండేళ్ల క్రితం బంగ్లాదేశ్ (Bangaladesh)లో విద్యార్ధుల తిరుగుబాటు నేపథ్యంలో పదవీచ్యుతురాలై దేశం విడిచి భారత్ పారిపోయి వచ్చేసిన మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) అప్పటి నుంచీ ఢిల్లీలో శరణార్దిగానే ఉంటున్నారు. అప్పట్లో విద్యార్థులపై కాల్పులకు ఆదేశించడం ద్వారా పలువురు ప్రాణాల్ని బలిగొన్నారనే ఆరోపణలతో పాటు కుట్రలకు పాల్పడినట్లు కూడా ఆమెపై అభియోగాలున్నాయి. వీటిని విచారించిన అక్కడి సుప్రీంకోర్టు.. ఇప్పటికే హసీనాకు మరణశిక్ష కూడా విధించింది. అదే సమయంలో ఆమెను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎప్పటినుంచో కోరుతోంది. ఈ నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
స్వదేశంలో దాడులకు భయపడి, భారత్ లో శరణార్ధిగా ఉండిపోయిన షేక్ హసీనాపై బంగ్లాదేశ్ కు తిరిగి రావాలనే ఒత్తిడి పెరుగుతోంది. అదీ తన సొంత పార్టీ అవామీలీగ్ నేతల నుంచే కావడం విశేషం. దీంతో ఎలాగైనా బంగ్లాదేశ్ కు తిరిగి వెళ్లాలని ఆమె నిర్ణయించుకున్నారు. మరణశిక్ష పడినా సరే తాను బంగ్లాకు వెళ్లి తీరుతానని ఈ మధ్య హసీనా ప్రకటించారు. దీనిపై ఇవాళ బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పందించింది. హసీనా నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రధాని తారిఖ్ రెహ్మాన్ సలహాదారు జాహెదుర్ రెహ్మన్ తెలిపారు.

2024లో విద్యార్థుల నేతృత్వంలో జరిగిన నిరసనలపై తన ప్రభుత్వం జరిపిన క్రూరమైన అణచివేతకు సంబంధించి మోపబడిన మానవత్వానికి వ్యతిరేక నేరాల ఆరోపణల నుండి రక్షించుకోవడానికి ప్రపంచంలోని అత్యుత్తమ న్యాయవాదులను ఢాకాకు తీసుకురావాలని హసీనాకు ఆయన సవాల్ విసిరారు. తాము న్యాయం జరగాలని కోరుకుంటున్నందున ఆమె ప్రకటనను స్వాగతిస్తున్నామన్నారు. ఆమె చేసిన నేరాలకు విధించిన మరణశిక్షను సమర్థించాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు, అలా జరిగితే ఆమెకు విధించిన మరణశిక్ష అమలవుతుందన్నారు. ఎందుకంటే ప్రజలు అదే కోరుకుంటున్నారని తెలిపారు. ఢాకాలోని అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ లో జరిగే విచారణ పారదర్శకంగా ఉంటుందని, దానిని పరిశీలకులు పర్యవేక్షించవచ్చని ,, వీడియో కవరేజ్ ద్వారా ప్రసారం చేయవచ్చని రెహ్మాన్ తెలిపారు. హసీనాకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును కోర్టు సవరించడం లేదా ఆమెను నిర్దోషిగా విడుదల చేయడం కూడా సాధ్యమేనని ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications