పెద్ది సినిమాలో పిచ్చెక్కించే ట్విస్ట్ ఇదే.. ఒక్కరు కాదు ఇద్దరు ??
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'పెద్ది'. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆస్కార్ అవార్డు గ్రహీత మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ భారీ బడ్జెట్ తో ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జగపతిబాబు, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేండు సహా పలువురు నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
ఈ మూవీని గ్రామీణ వాతావరణంలో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ షాట్ గ్లింప్స్, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఉత్తరాంధ్ర యాసలో ఏదైనా నేలమీద ఉన్నప్పుడే చేసేయ్యాలి.. పుడాతామా ఏంటి మళ్లీ.. అంటూ చరణ్ చెప్పిన డైలాగ్ తెగ వైరల్ అయ్యింది. ఇప్పుడు ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి మరో ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతోంది.

కాగా మార్చి 27వ తేదీ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి పహిల్వాన్ గ్లింప్స్ (pehelwan glimpse ) రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇది ఫుల్ ట్రెండింగ్ గా మారగా.. దీని గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
తండ్రి కొడుకులుగా చరణ్..
అయితే ఇంతకు ముందు ఈ సినిమా నుంచి విడుదల చేసిన గ్లింప్స్ లో రామ్ చరణ్ చెవికి, ముక్కుకు పోగుతో కనిపించారు. అయితే చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పహిల్వాన్ గ్లింప్స్ లో చరణ్ కు చెవి ముక్కుకు పోగు లేకుండా ఉన్నారు. దీంతో చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారా? తండ్రి కొడుకులుగా నటిస్తున్నారా? అంటూ సందేహ పడుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ భారీ హిట్ కొట్టాలని మెగా ఫ్యాన్స్ ఆశతో ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications