అబ్బో.. చిరంజీవికి రోషం పొడుచుకొచ్చిందే!

చిరంజీవికి రోషం ఒక్కసారిగా పొడుచుకొచ్చిందే.. మొన్నటివరకు ఐదేళ్లలో వైసీపీ నాయకులు తన కుటుంబాన్ని, తమ్ముడు పవన్ కల్యాణ్ కుటుంబాన్ని ఎన్ని అన్నా తనను కాదన్నట్లుగా మౌనంగా ఉన్న చిరంజీవి ఒక్కసారిగా బాలయ్య వ్యాఖ్యలకు సమయం కూడా తీసుకోకుండా స్పందించారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. పవన్ కల్యాణ్ భార్య, పిల్లలపై వ్యక్తిత్వ హననాలకు పాల్పడితే ఏనాడూ వారించలేదు. స్వయంగా తనను విమర్శించినా, సమావేశానికి పిలిచి నమస్కారం పెట్టించుకొని, ఆ వీడియోలు, ఫొటోలు బయటకు విడుదల చేసి అవమానపరిచినా తుడిచేసుకున్నారు.

వ్యంగ్యంగా మాట్లాడారంటున్న చిరు
చిరంజీవికి అవమానం జరిగిన మాట వాస్తవమే.. జగన్ ను గట్టిగా పిలవాల్సిన అవసరంలేదు.. అతనే వస్తాడు.. అతన్ని పిలిచేది ఏంటి? చిరంజీవి గట్టిగా పిలవలేదు.. అనేది బాలయ్య ఉద్దేశం. అయితే తాను అనుకున్నది చెప్పడంలో తడబడ్డాడు. అలా తడబడటం అతనికి సహజంగా ఉన్న లక్షణమే. అయితే వైసీపీ శ్రేణులు దీన్ని రాద్ధాంతం చేస్తున్నాయి. అంతేకాదు.. చిరంజీవి వెంటనే స్పందించి బాలయ్య వ్యంగ్యంగా మాట్లాడారు అన్నారు. జగన్ పిలిస్తేనే తాము వెళ్లామని, అందరం కలిసివస్తామని చెబితే సరే అన్నారు. నన్ను సాదరంగా ఆహ్వానించారు.. పరిశ్రమ ఇబ్బందులు చెప్పాను అంటూ ప్రకటన విడుదల చేశారు.

People are expressing surprise at mega star Chiranjeevi s anger

తనలా తమ్ముడు కూడా జెండా పీకేయాలా?
చిరంజీవిని, చిరంజీవి కుటుంబ సభ్యులను ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆ పార్టీ నాయకులు ఎలా మాట్లాడారో రాష్ట్ర ప్రజలంతా చూశారు. ప్రజాప్రతినిధులు అంత అసహ్యంగా మాట్లాడతారని, రాజకీయాలంటే ఇంత చంఢాలంగా ఉంటాయి కాబోలు అని ప్రజలు అనుకున్నారు. కానీ ఆరోజు రాని కోపం, ఆరోజు రాని రోషం చిరంజీవికి ఇప్పుడు ఎందుకు వచ్చిందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అంటే కూటమి ప్రభుత్వంలో తమ్ముడు కలిసివుండటం ఇష్టం లేదా? తనలా సొంతంగా పార్టీ పెట్టి తర్వాత జెండా పీకేయాలనేది ప్రధాన ఉద్దేశమా? ప్రజలకు మంచి పరిపాలన అందివ్వకూడదా? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+