సాయి ధరమ్ తేజ్‌కు పోలీసుల నోటీసులు... అరెస్ట్?
మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి పుట్టుకొచ్చిన మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్. చిరంజీవికి మేనల్లుడు అవుతాడు. పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు బ్లాక్ బస్టర్ హిట్లు ఏమీ కొట్టకపోయినప్పటికీ తన మంచి మనసుతో, ఇతరులకు సాయం చేసే గుణంతో పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నాడు. పరిశ్రమ బయట కూడా ఎవరికి ఏ సహాయం కావాలన్నా తనకు తోచినంతలో చేయడానికి ముందుకు వస్తుంటాడు. తన తల్లి పేరు కలిసివచ్చేలా సాయి ధరమ్ తేజ్ పేరు మార్చుకొని సాయిదుర్గా తేజ్ అయ్యాడు.
వివరాలు తెలిపిన సంపత్ నంది
ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు ముందు ఆయన సంపత్ నంది దర్శకత్వంలో గాంజా శంకర్ సినిమా చేయాలనుకున్నారు. సితార్ ఎంటర్టైన్మెంట్ బ్యానరుపై సూర్యదేవర నాగవంశీ నిర్మాత అనుకున్నారు. ఈ సినిమాకు సంబంధించి అప్పట్లో సాయిధరమ్ తేజ్ మొదటి లుక్ ను కూడా విడుదల చేశారు. ఈ సినిమాపై మెగా అభిమానులు బాగా ఆశ పెట్టుకున్నారు. అయితే ఆ సినిమా నుంచి తర్వాత ఎటువంటి అప్ డేట్ రాలేదు. దీంతో ఏమైందో తెలియక మెగా అభిమానులు అయోమయానికి గురయ్యారు. అయితే అసలు విషయాన్ని దర్శకుడు సంపత్ నంది వెల్లడించారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గాంజా శంకర్ పేరు మార్చుకోవాలంటూ పోలీసులు నోటీసులు పంపించినట్లు తెలిపాడు.

అందరికీ నోటీసులు పంపిన పోలీసులు
తనతోపాటు సాయిధరమ్ తేజ్ కు, నిర్మాత నాగవంశీకి కూడా పోలీసులు నోటీసులు పంపించారని చెప్పారు. ముందుగా ఒక కథ రాసుకొని ఆ ప్రకారం టైటిల్ కూడా పెట్టుకున్న తర్వాత దాన్ని మార్చమంటే అయ్యేపని కాదని, ఎందుకంటే కథను బట్టి టైటిల్ పెట్టామని, టైటిల్ మార్చాలంటే కథను మార్చాల్సి వస్తుందన్నారు. అందుకే ఇవన్నీ వద్దని అనుకున్నామని, పూర్తిగా సినిమానే ఆపేయాలని నిర్ణయించుకున్నట్లు సంపత్ నంది వివరించారు. సాయిధరమ్ తేజ్ కు ద్విచక్ర వాహన ప్రమాదం జరిగిన తర్వాత కొంత సమయం తీసుకొని విరూపాక్ష విడుదల చేశాడు. అది బంపర్ హిట్ అయింది.
అలాగే గాంజా శంకర్ కూడా ఆడుతుంది కచ్చితంగా అని మెగా అభిమానులు అనుకుంటున్న తరుణంలో అసలు సినిమానే లేదని దర్శకుడే ప్రకటించడంతో నిరాశకు గురవుతున్నారు. అసలు పోలీసులు ఎందుకు నోటీసులు పంపించారు? అనేది దర్శకుడు చెప్పలేదు. ఒకవేళ వేరే వారి టైటిల్ ను వీరు పెట్టుకొని ఉంటారని, అందుకే నోటీసులు పంపించివుంటారని, అలాగే ముందుకు వెళ్లివుంటే హీరోతోపాటు దర్శకుడు, నిర్మాతను కూడా పోలీసులు అరెస్ట్ చేసేవారని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications