సెంట్రల్ జైలుకు స్టార్ హీరో, మళ్లీ పోలీసు కస్టడీకి ఇస్తారా?, ఇప్పటికే జైల్లో గర్ల్ ఫ్రెండ్ మకాం
కర్ణాటకలోని చిత్రదుర్గ నివాసి రేణుకాస్వామి హత్య కేసులో గత 12 రోజులుగా పోలీసులు విచారిస్తున్న నటుడు దర్శన్ తూగుదీపతో పాటు నలుగురు అనుచరులను శనివారం పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించడం దాదాపు ఖాయమైంది.హీరో దర్శన్ ను ఇంతకాలం విచారణ చేసిన పోలీసు అధికారులు హత్య కేసుకు సంబంధించి ఆయన దగ్గర కీలక సమాచారం సేకరించారని తెలిసింది.
పోలీసు కస్టడీ ముగియడంతో దర్శన్‌తో పాటు అతని సన్నిహితులు వినయ్, ప్రదుష్, ధనరాజ్‌లను శనివారం బెంగళూరు నగరంలోని ఏసీఎంఎం కోర్టులో హాజరుపరచనున్నారు. ఇప్పటికే మూడుసార్లు విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్న పోలీసులు మళ్లీ నిందితులను పోలీసు కస్టడీకి అప్పగించే అవకాశం లేకపోలేదు. అలా జ్యుడీషియల్ కస్టడీకి తీసుకురాకపోతే దర్శన్ అండ్ గ్యాంగ్ చివరకు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు వెళ్లాల్సి వస్తుంది.

గురువారం దర్శన్ సహా నలుగురిని కోర్టులో హాజరు పరిచిన పోలీసులు వారిని మరో రెండు రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. ఈ గడువు ముగిసిన తర్వాత మళ్లీ కోర్టులో హాజరుపరచనున్నారు. చట్టంలో కూడా పోలీసులు మళ్లీ కస్టడీ తీసుకునే అవకాశం లేదని న్యాయనిపుణులు అంటున్నారు.
ఇదే కేసులో ఇప్పటికే అరెస్టు అయిన హీరో దర్శన్ ప్రేమికురాలు, నటి పవిత్ర గౌడతో సహా 12 మంది నిందితులు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు చేరడంతో వారి జైలు జీవితం మొదలైయ్యింది.
ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ సహా మిగిలిన నలుగురిని శనివారం సాయంత్రంలోగా పోలీస్ స్టేషన్ లాకప్ నుంచి సెంట్రల్ జైలులోని డార్క్ రూమ్ కు తరలించనున్నట్లు తెలిసింది.
తన ప్రేమికురాలు పవిత్ర గౌడకు ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకరమైన సందేశాలు పంపినందుకు చిత్రదుర్గ నుంచి రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి బెంగళూరుకు తీసుకొచ్చి దారుణంగా దాడి చేసి అతన్ని హత్య చేశారనే ఆరోపణలపై నటుడు దర్శన్, నటి పవిత్ర గౌడతో పాటు మొత్తం 17 మందిని పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications