పూజా హెగ్డేకు గాయాలు.. అక్కడ ఎలా అయిందంటూ నెటిజన్లు ట్రోలింగ్
ఒక్కప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అందరు ఠక్కున పూజా హెగ్డే పేరు చెప్పేవారు. దాదాపు టాలీవుడ్ టాప్ హీరోలందరి సరసన నటించింది. మహేష్ బాబుతో మహర్షి, ప్రభాస్‌తో రాధే శ్యామ్, ఎన్టీఆర్ సరసన అరవింద సమేత, అల్లు అర్జున్‌తో అల వైకుంఠపురం సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగు ఇండస్ట్రీలో కొన్నాళ్లు టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన పూజా హెగ్డే... అనుహ్యంగా కనుమరుగైంది.
వరుస ప్లాపులు రావడంతో బుట్టబొమ్మ రేసులో వెనుకపడిపోయింది. రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్, సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ ఇలా ఆమె నటించిన సినిమాలన్ని కూడా బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టాయి. ఇదే సమయంలో శ్రీలీలకు తెలుగులో డిమాండ్ పెరగడంతో పూజా హెగ్డేను టాలీవుడ్ పూర్తిగా పక్కన పెట్టేసింది. పైగా గురుజీ సైతం గుంటూరు కారం సినిమా నుంచి తప్పించడంతో.. పూజా హెగ్డేకు తెలుగులో ఒక్క సినిమా కూడా లేకుండా పోయింది.

ఇదిలా ఉంటే పూజా హెగ్డే తాజాగా తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. తన కాలికి గాయం అయిందంటూ ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. ఈ ఫొటోలో పూజా హెగ్డే మోకాలికి గాయం అయినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. పూజా హెగ్డేకు అయిన గాయం చూసిన అభిమానులు ఆమెకు ఏమైందని ఆందోళన చెందుతున్నారు.
అసలు అక్కడ ఎలా గాయం అయిందని మరికొందరు ఆరా తీస్తున్నారు. షూటింగ్ సమయంలో తీసుకున్న ఫొటోనా ? లేక వ్యాయామం చేస్తూ గాయపడ్డారా అని అభిమానులు పూజా హెగ్డేను ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానంగా పూజా హెగ్డే బాక్సింగ్ చేస్తుండా గాయం అయినట్టు వివరణ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications