ఆ హీరోయిన్‌ని నాగ చైతన్య నమ్మించి ముంచేశాడుగా.. ?

అక్కినేని నట వారసుడుగా ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య. తాత, తండ్రి వారసత్వాన్ని నాగచైతన్య కొనసాగిస్తారని అభిమానులంతా భావించారు. అయితే నాగచైతన్య హీరోగా నిలబడటానికి నానా తంటాలు పడుతున్నాడు. నాగచైతన్య ఇప్పటి వరకు చాలా సినిమాల్లో నటించాడు . కానీ హిట్ కొట్టింది మాత్రం చాలా చాలా తక్కువే అని చెప్పాలి. చైతన్య కెరీర్‌లో ఇప్పటి వరకు బ్లాక్ బ్లాస్టర్ హిట్ ఒక్కటి కూడా లేదు. హిట్ కొట్టిన సినిమాల్లో కూడా స్టోరీ పరంగాను హీరోయిన్ పరంగాను హిట్ అయినవే ఎక్కువ అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది.

స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన మహేష్ , ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి వారు సూపర్ స్టార్లుగా ఎదిగారు. అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన నాగ చైతన్య మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. నాగచైతన్య హీరోగా నిలబడటానికి నానా తంటాలు పడుతున్నాడు. దీంతో ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో నాగ చైతన్య వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తాండేల్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాపై నాగ చైతన్య భారీ ఆశలనే పెట్టుకున్నాడు.

pooja hegde ruled out of one more telugu movie

అటు ఇండస్ట్రీలో కూడా తాండేల్ మూవీపై పాజిటివ్ టాక్ నడుస్తోంది. ఈ సినిమాతో నాగ చైతన్య రూ.100 కోట్ల మార్కెట్‌లో చేరతారని అంతా భావిస్తున్నారు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాకు గ్రీన్ సీగ్నల్ ఇచ్చాడు. విరూపాక్ష సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ట్ డైరెక్టర్‌గా మారిపోయిన కార్తీక్ దండు దర్శకత్వంలో ఒక సినిమాకి చేయడానికి నాగ చైతన్య రెడీ అయ్యాడు. 'విరూపాక్ష' మాదిరిగానే ఈ సినిమా కూడా హారర్ జోనర్‌లో తెరకెక్కబోతుంది.

ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను హీరోయిన్‌గా ఎంపిక చేశారనే ప్రచారం జరిగింది. అయితే తాజాగా పూజా హెగ్డెను కాదని గురూజీ హీరోయిన్ మీనాక్షి చౌదరిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. గుంటూరు కారం సినిమాలో వాస్తవానికి శ్రీలీల స్థానంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించాల్సింది. పూజా హెగ్డే హీరోయిన్‌గానే ఈ చిత్రాన్ని ప్రారంభించారు. కానీ అనూహ్యంగా ఆమెని తొలగించి శ్రీలీలని తీసుకున్నారు. ఇప్పుడు నాగ చైతన్య సైతం పూజా హెగ్డేను కాదని మీనాక్షి చౌదరిని ఎంపిక చేయడం జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+