బాలీవుడ్ స్టార్ హీరో కొడుకుతో నటించనున్న పూజా హెగ్దే!
నటి పూజాహెగ్దే తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ బ్యూటీ తెలుగులో స్టార్ హీరోలందరితో నటించి మంచి పేరు సంపాదించుకుంది. అయితే, గతకొంతకాలంగా ఈ అమ్మడు సినిమాల్లో కనిపించడం లేదు. టాలీవుడ్‌లో మెరిసిన ఈ భామ బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చింది. గతేడాది 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్' సినిమాలో కనిపించిన ఈ చిన్నది ఆ తర్వాత ఏ సినిమాలోనూ కనిపించలేదు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ లాంటి స్టార్స్ తో కలిసి నటించింది.
ఈ సినిమా భారీ అంచనాల మధ్య వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను అందించలేకపోయింది. ఆ తర్వాత తెలుగులో గుంటూరు కారం సినిమాలో ఆఫర్ వచ్చినా, ఆ సినిమా షూటింగ్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో ఈ అమ్మడుకీ ఈ మధ్యకాలంలో ఎలాంటి సినిమా ఆఫర్లు రాలేదు. తాజాగా, ఇప్పడు మరో బాలీవుడ్ సినిమాకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అదికూడా బాలీవుడ్ స్టార్ హీరో తనయుడితో జతకట్టనుందట..!

నటి పూజాహెగ్దే బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి తనయుడు అహాన్ శెట్టితో 'సంకీ' అనే సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ ను కూడా పూర్తిచేసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ జూన్‌లో ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది. ఇది పూర్తిగా ఓ ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకోనుందట.
ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సాజిద్ నడియాడ్‌వాలా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నారు. ఈ చిత్రం షూటింగ్ కోసం ముంబయిలో ఓ సెట్‌ను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. ఇది పూర్తిగా రొమాంటిక్ చిత్రంగా తెరకెక్కనుందట. బాలీవుడ్‌లోని ఈ చిత్రంతో పాటు టాలీవుడ్‌లో కూడా ఈ ముద్దుగుమ్మకు మరో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆ వివరాలేంటో తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications