పవన్ కల్యాణ్‌పై రెచ్చిపోయిన హీరోయిన్..పెళ్లాం, పిల్లల్ని ఇంట్లో నుంచి గెంటేసి
హీరోయిన్ పూనమ్ కౌర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె గతంలో పలుమార్లు పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తుంటారు. వీరి మధ్య ఏం జరిగిందో క్లారిటీ లేకపోయినప్పటికీ..అవకాశం చిక్కినప్పుడల్లా కూడా పవన్, త్రివిక్రమ్‌లపై మండిపడుతుంటుంది. తాజాగా ఆమె మరోసారి పవన్ కల్యాణ్ పేరు ఎత్తకుండా, గురూజీపై విమర్శలు గుప్పించారు. కట్టుకున్న దాన్ని పిల్లలతో సహా రోడ్డు మీదకు గెంటేస్తుంటారు.
భర్త ఎలాంటి పనులు చేసినా ఆ వచ్చిన భార్యలు అంగీకరిస్తుంటారు. కానీ కట్టుకున్నది మాత్రం జీవితాంతం బాధపడుతూనే ఉంటుంది.గురూజీ దయ వల్ల వచ్చిన ఆ భార్య మాత్రం హాయిగా ఉంటుంది ఇదే గురూజీ స్క్రిప్ట్.భారత మహిళల బ్రెయిన్స్‌ని చిన్నతనం నుంచి ఒకలా ట్యూన్ చేసి పెట్టారు.భర్త సుఖమే నీకు సుఖం అనే భ్రమలో ఉండేలా చేస్తారు. భర్త కోసం అన్నీ త్యాగం చేయాలనే మాటలు చెప్పి అలానే పెంచుతారు.

ఆమె ఎంతో మంచిది.నిజాయితీ పరురాలు ఏమున్నా సరే ఎదుటి వారికి ఇచ్చే గుణమని..కుటుంబాన్ని సంతోషంగా ఉంచడానికి మిమ్మల్ని మీరు అగౌరవ పరచుకోవడం సరైనదనే ఆలోచనను కొందరు సృష్టిస్తారు. దీన్ని ఎప్పుడూ చేయవద్దని రాసుకొచ్చింది.ఈ అమ్మడు పవన్ పేరు తీసుకు రాకపోయినప్పటికీ గురూజీ అంటూ త్రివిక్రమ్ వల్లే పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని ఇండైరెక్ట్‌గా చెప్పకనే చెప్పేసింది.

ఇక పూనమ్ పోస్టులు చూసిన కొందరు పవన్ కల్యాణ్ గురించే పెట్టిందని అంటున్నారు.గతంలో కూడా ఇలానే పలుమార్లు పవన్ కల్యాణ్, త్రివిక్రమ్‌ల గురించి కామెంట్స్ చేసింది. పవన్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కూడా ఆయనపై పరోక్షంగా సెటైర్లు వేసింది. పవన్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సుగాలి ప్రీతి హత్య కేసులో న్యాయం జరగాలంటూ డిమాండ్ చేస్తూ ట్వీట్ చేసింది. ఇప్పుడు మరోసారి పవన్ మూడు పెళ్లిళ్లు, విడాకులు గురించి స్పందించింది. ప్రస్తుతం పవన్‌ను ఉద్దేశించి చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications