వారికి భజన చేయడం వల్లే చిరంజీవికి పద్మ అవార్డు
నటి పూనమ్ కౌర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఎప్పుడూ జనసేన అధినేత పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌లపై పరొక్షంగా ట్వీట్లు చేసే పూనమ్ కౌర్ తాజాగా మెగాస్టార్ చిరంజీవి గురించి ఓ పోస్ట్ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే చిరంజీవికి పద్మ విభూషన్ అవార్డు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. చిరంజీవికి అవార్డు రావడంపై పలువురు సెలబ్రిటీలు ఆయనకు అభినందనలు తెలిపారు. అయితే తాజాగా పూనమ్ కౌర్ అవార్డులపై వివాస్పద కామెంట్ చేశారు.

బాలీవుడ్ హీరో సోనుసూద్ కూడా ఈ ప్రెస్టీజియస్ అవార్డుకు అర్హుడే. కరోనా సమయంలో ఆయన చేసినన్ని సేవలు మరే హీరో కూడా చేయలేదు. ఆయనకు అవార్డు ఇవ్వకుండా వేరే వ్యక్తులకు ఇవ్వడానికి పూనమ్ కౌర్ తప్పు పట్టారు. అయితే సోనుసూద్‌కు పని చేయడమే తెలుసునని.. రాజకీయ నాయకులకు భజన చేయడం తెలియదు కదా అంటూ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ను షేర్ చేసింది.

చిరంజీవి కొందరిని కాకపట్టడం వల్లే పద్మ భూషన్ అవార్డు వచ్చిందిన్నట్టుగా పూనమ్ కౌర్ చెప్పుకొచ్చింది. దీంతో మెగా అభిమానులు పూనమ్ కౌర్‌ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తుంటే మరికొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. పూనమ్ కౌర్ గతంలో కూడా ఇలా వివాదాల్లో చిక్కుకొని వార్తల్లో నిలిచారు ముఖ్యంగా మాంత్రికుడు త్రివిక్రమ్ టార్గెట్‌గా విమర్శలు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం చిరంజీవిపై పూనమ్ కౌర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications