పిల్లల కళ్ళ ముందే భార్య కాళ్ళు చేతులు కట్టేసి గొంతుకోసిన భర్త!

హన్మకొండ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక భార్యను భర్త కొడుకు ముందే అత్యంత పాశవికంగా హతమార్చిన ఘటన స్థానికంగా ప్రతి ఒక్కరిని షాక్ కు గురి చేసింది. కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే..

కాళ్ళు చేతులు కట్టేసి భార్యను హతమార్చిన భర్త

హన్మకొండలోని యాదవ నగర్ లో భార్యను దారుణంగా హతమార్చాడు. భార్య కాళ్లు చేతులు కట్టేసి గొంతు కోసి కిరాతకంగా హత్య చేశాడు. కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో ఆరేళ్ల క్రిందట అనిల్, రజిత ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

husband slit wife throat In hanamkonda a man allegedly murdered his wife infront of the kids

కేసు నమోదు చేసుకున్న పోలీసులు

ఇదే క్రమంలో నిన్న రాత్రి అనిల్, రజిత గొడవపడ్డారు. ఈ క్రమంలో ఆవేశానికి లోనైన అనిల్, భార్య కాళ్లు చేతులు కదలకుండా కట్టేసి ఆమె గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. ఇంట్లో ఘర్షణ విన్న స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పిల్లల ముందే పాశవికంగా.. కుటుంబ కలహాలా? మరేదైనా కారణం ఉందా?

కుటుంబ కలహాలతోనే ఈ దారుణం జరిగిందా లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పిల్లల ముందే ఈ దారుణ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మమ్మీ తో గొడవపడి డాడీ ఆమె కాళ్లు చేతులు కట్టేసి గొంతు కోసి ఎలా చంపాడో ఆ చిన్నారులు పోలీసులకు వివరించారు. ఇది విన్న ప్రతి ఒక్కరు ఆవేదనకు గురయ్యారు.

హెలిప్యాడ్‌తో.. టవర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌తో.. తెలంగాణాలో ఆ పండ్ల మార్కెట్!
హెలిప్యాడ్‌తో.. టవర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌తో.. తెలంగాణాలో ఆ పండ్ల మార్కెట్!

అనాధలుగా చిన్నారులు

తల్లి హత్యకు గురి కావడంతో పాటు, తండ్రి జైలుకు వెళ్లే పరిస్థితులలో ఆ ఇద్దరు పిల్లల పరిస్థితి ఏమిటి అనేది స్థానికులను ఆవేదనకు గురిచేస్తుంది. కుటుంబ కలహాలైనా, ఇతర ఏ కారణాలైనా కూర్చుని పరిష్కరించుకోవాలి కానీ ఈ రకంగా దారుణాలకు ఒడి కడితే కుటుంబమే లేకుండా పోతుంది. నిన్న రాత్రి హనుమకొండలో జరిగిన ఈ ఘటనలో మిగులుతున్న ఆ చిన్నారుల భవిష్యత్తు మీద తీవ్ర ప్రభావం పడుతుంది. తల్లి లాలన లేక, జైలు పాలైన తండ్రి పిల్లలుగా సొసైటీలో వారు పెరగడం మొత్తంగా వారి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+