కొంపముంచిన హీరోయిన్‌తో ఎఫైర్..హత్య కేసులో హీరో అరెస్ట్
కన్నడ స్థార్ హీరో దర్శన్ హత్య కేసులో అరెస్ట్ అయ్యారు. దర్శన్ ఓ వ్యక్తిని హత్య చేయించారనే ఆరోపణలతో ఆయన్ను మంగళవారం కన్నడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే..హీరో దర్శన్ మొదటి నుంచి కూడా వివాదాల్లోనే కొనసాగుతున్నారు. పెళ్లై, భార్య పిల్లలు ఉన్నప్పటికి కూడా ఆయన పలువురితో బహిరంగంగానే ఎఫైర్ సాగించారు. నిఖిత హీరోయిన్‌గా ఎదుగుతున్న సమయంలోనే దర్శన్‌తో ప్రేమలో పడింది. అప్పటికే దర్శన్‌కు వెళ్ళింది.అయినా ఈ ఇద్దరూ క్లోజ్‌గా మూవ్ అయ్యారు.
ఈ విషయం తెలుసుకున్న దర్శన్ భార్య విజయలక్షి అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిఖితతో ఎఫైర్ వల్ల దర్శన్ జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది.దీంతో నిఖితను కన్నడ ఇండస్ట్రీ మూడేళ్లు నిషేధం విధించింది. ఆ తర్వాత నిఖిత పెద్దగా సినిమాల్లో నటించలేదు. 2017లో వ్యాపారవేత్త గగన్‌దీప్ సింగ్ మాగోను నిఖిత పెళ్లి చేసుకుంది. ఈ వివాదం ముగిసిందనుకునేలోపే దర్శన్ ఏకంగా హత్య కేసులో ఇరుకున్నారు. దర్శన్ ప్రస్తుతం పవిత్ర గౌడ అనే అమ్మాయితో సన్నిహితంగా ఉంటున్నారు.

ఆమెను రేణుక స్వామి అనే వ్యక్తి కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నాడు. రేణుక స్వామి తనని వేధిస్తున్నాడనే విషయాన్ని పవిత్ర గౌడ దర్శన్‌కు తెలియజేసింది. దీంతో రేణుక స్వామిని దర్శన్ హత్య చేయించినట్టు తెలుస్తోంది.ఈ కేసులో ఇప్పటి వరకు 9 మందిని అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు. దర్శన్ చెబితేనే తాము ఈ హత్య చేసినట్టు నిందితులు చెప్పడంతోనే దర్శన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై అటు దర్శన్ కానీ వారి ఫ్యామిలీ కానీ ఎవరూ ఇప్పటి వరకు స్పందించలేదు.












Click it and Unblock the Notifications