జూనియర్ ఎన్టీఆర్ పై పోసాని కృష్ణమురళి కామెంట్స్?

ఏపీలో ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న పోసాని కృష్ణమురళి నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. అందరు హీరోల అభిమానులకు ఆయన విలన్ గా మారిపోతున్నారు. ఎవరినుద్దేశించి ఈ వ్యాఖ్యలు చేస్తున్నారో, ఎవరిని సంతోషపరచడానికి ఆయన అలా మాట్లాడుతున్నాడో అర్థం కావడంలేదంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. ఇటీవలే ఆయన యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై వ్యాఖ్యలు చేశారు.

ఫైరవుతున్న అభిమానులు : జూనియర్ ఎన్టీఆర్ అయినా, జూనియర్ ఆర్టిస్ట్ అయినా ఒకటే అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేశాడు. వీటిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అలా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ పోసాని అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యల వల్ల ఏం సాధించాలనుకుంటున్నారని, ఏ బావ కళ్లల్లో ఆనందం చూడాలనుకుంటున్నారంటూ టిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

posani krishnamurali and junior ntr issue latest update

ప్రాస కోసం పాకులాడొద్దు : జూనియర్ ఆర్టిస్టులను జూనియర్ ఎన్టీఆర్ తో పోల్చడం ఏంటని, పోసానిని అభిమానించే వాళ్లను కూడా అలా పోల్చి కామెంట్లు చేస్తే ఆయన సైలెంట్ గా ఉంటారా? అంటూ మండిపడుతున్నారు. ప్రాస కోసం కామెంట్లు చేసి వివాదాల్లో ఇరుక్కోవద్దని, తమ ఆగ్రహానికి గురికావొద్దంటూ హెచ్చరిస్తున్నారు. ఇలాంటి కామెంట్ల వల్ల తన స్థాయిని ఆయనే తగ్గించుకుంటున్నాడంటున్నారు.

రుచిచూస్తావా ఒకసారి : దీనిపై జూనియర్ ఎన్టీఆర్ సైలెంట్ గా ఉన్నా తాము సైలెంట్ గా ఉండబోమని, బ్యాగ్రౌండ్ ఉన్నా ఎంతో కష్టపడి తారక్ ఈ స్థాయికి చేరుకున్నాడనే విషయం అందరికీ తెలుసన్నారు. పోసాని పదేపదే జూనియర్ ప్రస్తావన తీసుకురావడం సరికాదంటున్నారు. మరోసారి ఇలాంటి కామెంట్లు పునరావృతమైతే జూనియర్ ఎన్టీఆర్ అభిమాలను ఆగ్రహం ఎలా ఉంటుందో రుచి చూడొచ్చంటున్నారు. ప్రస్తుతం అన్నీ తారక్ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారు. దేవర రెండు భాగాలుగా రాబోతుండగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా, వార్ లో ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+