ఏపీ, తెలంగాణలో పుష్ప2 బాయ్‌కాట్..?
ఒక చిన్న వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. వారిలోవారికి ఎన్ని విభేదాలున్నప్పటికీ ఎప్పుడూ బయటపడని మెగా కుటుంబం.. రాజకీయాల కారణంగా రోడ్డుపైకి రావాల్సి వచ్చింది. దీనిక కారణం అల్లు అర్జున్. ఆ తర్వాత నాగబాబు. నంద్యాల నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లి మరీ బన్నీ మద్దతు తెలిపారు. తన స్నేహితుడు కాబట్టి మద్దతిచ్చానని స్పష్టం చేశారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం కూడా లేదన్నారు.
మా వాడైనా పరాయివాడే
అయితే దీనిపై నాగబాబు ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. 'మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే...!' అని ఆ ట్వీట్ లో ఉంది. అది కచ్చితంగా అల్లు అర్జున్ ను ఉద్దేశించి చేసిందేనని అందరికీ అర్థమైంది. దీనిపై చిరంజీవి నాగబాబుకు క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. మనలో మనకు ఎన్నివున్నా అవి ఇంటిలోపలే ఉండాలని, ఎప్పుడూ గేటు దాటకూడదని హెచ్చరించారు.

చెప్పను బ్రదర్
పవన్ కల్యాణ్ కు బన్నీ ట్వీట్ చేసి మద్దతు తెలిపాడు. అయితే స్నేహితుడికి ఇచ్చిన విలువ చిన మామయ్యకు ఇవ్వలేకపోయాడా? అంటూ పవన్ కల్యాణ్ అభిమానులు భగ్గుమన్నారు. గతంలో ఓ సినిమా వేడుకలో పవన్ కల్యాణ్ గురించి చెప్పాలంటూ అభిమానులు గొడవ చేస్తుంటే చెప్పను బ్రదర్ అని బన్నీ అన్నాడు. ఆ వెంటనే విడుదలైన దువ్వాడ జగన్నాథం టీజర్ కు 24 గంటల వ్యవధిలో రెండు లక్షలకు పైగా డిస్ లైక్స్ కొట్టారు. ఆ సినిమాకు కలెక్షన్లు కూడా రాలేదు. ఫ్లాప్ అయింది. పవన్ కల్యాణ్ అభిమానులు దూరంగా ఉండటమే దీనికి కారణం.

పుష్ప2 బాయ్ కాట్
తాజాగా పుష్ప2 సినిమా షూటింగ్ జరుగుతోంది. ఆగస్టు 15వ తేదీన విడుదల కాబోతోంది. ఏపీ, తెలంగాణలోని పవన్ కల్యాణ్ అభిమానులంతా ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి విజయవాడలో సమావేశమైన పవర్ స్టార్ అభిమానులు చర్చలు జరుపుతున్నారు. తను మనకు మద్దతుగా లేనప్పుడు అతని సినిమాలకు మనం మాత్రం మద్దతివ్వడం ఎందుకని వ్యాఖ్యానిస్తున్నారు. సినిమాకు కలెక్షన్లు కావాలంటే వైసీపీ అభ్యర్థికి మద్దుతిచ్చాడు కాబట్టి ఆ పార్టీవారితోనే గతంలో వచ్చినన్ని కలెక్షన్లు తెప్పించుకోవాలంటూ సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications