ప్రభాస్ - లావణ్య త్రిపాఠి కాంబోలో మిస్ అయిన సినిమా
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని కొన్ని కాంబినేషన్లు చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంటాయి. హీరో-హీరోయిన్ కానీ, హీరో-డైరెక్టర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్-హీరోకానీ.. ఇలా కొన్ని కాంబోలు రికార్డులను కూడా సృష్టిస్తాయి. సినిమా తెరపై చూసినప్పుడు ఒక జంట ఎంత ముచ్చటగా ఉన్నారు అని ప్రేక్షకులు అనుకుంటారో.. అలాగే అరే.. ఈ జంట బాగా నప్పినట్లు లేదే.. వేరేవారైతే బాగుండేదేమో అనే ఊహ ప్రేక్షకులకు కలుగుతుంది.
తాజాగా అలాంటి మంచి జంటను వెండితెరపై చూసే భాగ్యానికి తెలుగు ప్రేక్షకులు నోచుకోలేదు. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ - మెగా కోడలు లావణ్య త్రిపాఠి కాంబినేషన్ లో ఓ సినిమా రావాల్సి ఉందికానీ అది తెరకెక్కలేదు. బాహుబలి సినిమాను తీయడానికి ముందు దర్శక ధీరుడు రాజమౌళి నటీనటులను ఎంపిక చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన తమన్నా పాత్రలో ముందుగా రాజమౌళి రాశీ ఖన్నాను అనుకున్నారు.

ఆమెకు కథ వినిపించిన తర్వాత సినిమాను తిరస్కరించింది. దీంతో అందమైన చందమామలా ఉండే లావణ్య త్రిపాఠిని తీసుకోవాలని రాజమౌళి భావించారు. ఆమెను కలిసి కథను వినిపించడం జరిగిందికానీ ఎందుకో లావణ్య ఈ సినిమాను తిరస్కరించింది. దీంతో దర్శక ధీరుడు చివరగా తమన్నాను కలిసి కథ చెప్పగా ఆమె ఓకే చేసింది. తర్వాత భారతదేశ సినీ చరిత్రలోనే నిలిచిపోయే విజయాన్ని సాధించడమేకాదు అనేక రికార్డులను బద్దలు కొట్టడానికి తోడు కొత్త రికార్డులను కూడా నెలకొల్పింది.
లావణ్య కనుక ఈ పాత్ర చేయడానికి ఒప్పుకొనివుంటే ఆమె రేంజ్ ఎక్కడో ఉండేదని, ప్రస్తుతం వరుణ్ తేజ్ ను వివాహం చేసుకోవడానికి కూడా వీలులేనంత బిజీగా ఉండేదని, కానీ భగవంతుడు ఏం అనుకుంటాడో అదే జరుగుతుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications