ప్రభాస్‌కు షాక్.. ఆన్‌లైన్‌లోకి వచ్చేసిన ‘కల్కి’ ఫుల్ మూవీ

సినీ ప్రపంచం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసిన కల్కి '2898 ఏడీ' గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో ప్యాన్ ఇండియా స్టార్ దీపిక పదుకొనే హీరో , హీరోయిన్‌గా నటించారు. అమితాబ్, కమల్ హాసన్ వంటి స్టార్స్ నటించడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా టీజర్ , ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమాపై ఆశలు రెట్టింపు అయ్యాయి. భారీ అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అన్ని ఏరియాల్లో పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మహానటి ఫేం నాగ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.

కురుక్షేత్ర యుద్ధం జరిగిన ఆరు వేల సంవత్సరాల తర్వాత భూమి మొత్తం నాశనం అవుతుంది. ఆ తర్వాత భూమి మీద ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో అనేది దర్శకుడు అద్భుతంగా చూపించారు. మనకు తెలియని వేరే ప్రపంచం చూపించడంలో నాగ్ అశ్విన్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ వంటి సెలబ్రిటీలు ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఇదిలా ఉంటే విడుదలైన మొదటిరోజే కల్కి సినిమా ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం కావడం ఇప్పుడు సంచలనంగా మారింది.

prabhas Kalki full movie in online

కల్కి ఫుల్ మూవీ మొదటి రోజే ఆన్‌లైన్‌లోకి వచ్చేసింది. కల్కి సినిమా ఆన్‌లైన్‌లో దర్శనమివ్వడం చిత్ర యూనిట్‌ను షాక్ గురి చేస్తోంది. కల్కి సినిమా మూవీరూల్స్‌‌తో పాటు పలు వెబ్‌సైట్లలో స్ట్రీమ్ అవుతోంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమాను ఆన్‌లైన్‌లో పెట్టిన వారిని వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. పైరసీ ప్రభావం సినిమా కలెక్షన్లపై పడే అవకాశం కనిపిస్తున్నాయి. టికెట్ల రేట్లు అధికంగా ఉండటం..ఆన్‌లైన్‌లో ఫుల్ మూవీ అందుబాటులో ఉండటంతో ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా అనే అనుమానం కలుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+