చైనాలో మార్మోగుతున్న ప్రభాస్ పాట.. అసలు కారణం ఇదే!

కొన్ని పాటలు కాలంతో పాటు కనుమరుగవుతాయి. మరికొన్ని ఏదో విధంగా తిరిగి ప్రాచుర్యం పొందుతాయి. ప్రభాస్ 'పౌర్ణమి' సినిమాలోని అద్భుతమైన పాట "భరత వేదముగా" విషయంలో సరిగ్గా అదే జరుగుతోంది. సినిమా విడుదలై దాదాపు 20 ఏళ్ల తర్వాత, నర్తకి మీరా వాంగ్ ఈ పాటకు ప్రదర్శన ఇవ్వడంతో చైనాలో ఈ పాటకు మళ్లీ కొత్తగా ప్రాచుర్యం లభిస్తోంది. ప్రస్తుతం ఈ పాట చైనాలోని ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Kaaka Movie: 'కాకా’లో చిరంజీవికి ఈమెనే స్పెషల్..!
Kaaka Movie: 'కాకా’లో చిరంజీవికి ఈమెనే స్పెషల్..!

ఈ వీడియోను ప్రత్యేకంగా నిలిపింది కేవలం ఆ పాట మాత్రమే కాదు.. దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన అనుబంధం కూడా. మీరా వాంగ్ మన భారతీయ సంప్రదాయ నృత్యం కూచిపూడిని నేర్చుకున్నారు. ఓ చైనీస్ కళాకారిణి మన తెలుగు పాటకు చేసిన కూచిపూడి నృత్యం చేయడంతో ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.

Prabhas Pournami Song Goes Viral in China After Kuchipudi Performance by Meera Wang Details Here

'బాహుబలి' సినిమాతో ప్రభాస గ్లోబల్ స్టార్‌గా మారడానికి చాలా కాలం క్రితమే.. అంటే ప్రభాస్ కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఈ 'భరత వేదముగా'పాట తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన క్లాసిక్ మెలోడీ. అయితే చైనాలోని కొత్త శ్రోతలకు మాత్రం ఈ సాంగ్ ఏదో కొత్తగా విడుదలైన చార్ట్‌బస్టర్ పాటలా అనిపిస్తుండటం విశేషం.

పవర్‌ఫుల్ విలన్‌గా దూసుకొస్తున్న కుర్ర హీరో! బాలయ్య 'దాదా’తో సీన్ మారనుందా?
పవర్‌ఫుల్ విలన్‌గా దూసుకొస్తున్న కుర్ర హీరో! బాలయ్య 'దాదా’తో సీన్ మారనుందా?

తెలుగు సినిమా సరిహద్దులు దాటి ప్రభాస్ క్రేజ్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. అయినప్పటికీ దాదాపు రెండు దశాబ్దాల క్రితం నాటి ఓ పాత పాటు ఓ చైనీస్ క్లాసికల్ డ్యాన్సర్ ద్వారా మళ్లీ ఇలా వెలుగులోకి రావడం అందరినీ ఆహ్లాదకరమైన ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కొన్నిసార్లు, పాటలు మళ్లీ కొత్తగా మారడానికి కొత్తగా విడుదల కావాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఎక్కడో ఒక చోటు దాన్ని ఆస్వాదించే సరైన నైపుణ్యం ఉన్న కళాకారులు దొరికితే చాలు అని ఈ ఘటన నిరూపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+