ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ మెసేజ్ ఇచ్చిన ప్రభాస్: కల్కి పార్ట్ 2పై లీక్
Prabhas: యంగ్ రెబెల్ స్టార్ నటించిన తాజా సినిమా.. కల్కి 2898 ఏడీ. ఈ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్‌కు నాగ్ అశ్విన్ దర్శకుడు. వైజయంతి మూవీస్ పతాకంపై సీ అశ్వినీదత్ ఈ సినిమాను నిర్మించారు. 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో చిత్రీకరణ జరుపుకొన్న ఈ పాన్ ఇండియా మూవీ.. కిందటి నెల 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది.
దీపిక పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశాపటానీ .. కీలక పాత్రల్లో నటించారు. అవెంజర్స్ తరహాలో హాలీవుడ్ రేంజ్‌లో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిందీ సైంటిఫిక్ థ్రిల్లర్. విడుదలకు ముందు ఉన్న ఎన్నో అంచనాలను అందుకుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది.

సలార్ తరువాత దాన్ని మించిన హిట్ కొట్టాడు యంగ్ రెబెల్ స్టార్. బ్యాక్ అండ్ బ్యాక్ సూపర్ హిట్స్ అందుకున్నాడు. సలార్ సీస్ ఫైర్ 700 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. త్వరలో దీని సీక్వెల్ సలార్ శౌర్యాంగపర్వం మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. దీనితో పాటు మారుతి దర్శకత్వాన్ని వహిస్తోన్న రాజా సాబ్ సినిమాను కూడా ఏకకాలంలో పూర్తి చేయాలనే ఉద్దేశంలో ఉన్నాడు ప్రభాస్.
ప్రస్తుతం కల్కి 2898 ఏడీ హిట్‌ను ఎంజాయ్ చేస్తోన్నాడు. తన ఆనందాన్ని ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. కల్కిని సూపర్ హిట్ చేసినందుకు అభిమానులకు పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పాడు. అభిమానులే లేకపోతే తాను జీరోనని వ్యాఖ్యానించాడు.

ఈ సినిమాను ఇంత అద్భుతంగా, హాలీవుడ్ రేంజ్‌లో తీర్చిదిద్దిన దర్శకుడు నాగ్ అశ్విన్‌కు థ్యాంక్స్ చెప్పాడు. నాగ్ అశ్విన్.. అయిదు సంవత్సరాల పాటు ఓ యజ్ఞంలా ఈ సినిమాను చిత్రీకరించారని, అంతే అద్భుతంగా తెరకెక్కించారని అన్నాడు. అనుకున్నది అనుకున్నట్లుగా తీయడానికి సహకరించిన నిర్మాత అశ్వినీదత్‌కూ ప్రభాస్ ధన్యవాదాలు తెలిపాడు.
ఇదంతా మీ వల్లే డార్లింగ్స్. థాంక్స్ అల్ #Prabhas #NagAshwin #PrabhasFans #Oneindiatelugu pic.twitter.com/idoBQ0tQYO
— oneindiatelugu (@oneindiatelugu) July 14, 2024
వాళ్లు లేకపోతే ఈ సినిమా లేదని ప్రభాస్ చెప్పాడు. ఇండియన్ సినిమా గ్రేటెస్ట్ లెజెండరీలు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్‌తో నటించే అవకాశం తనకు దక్కిందని అన్నాడు. మోస్ట్ గార్జియస్ లేడీగా దీపికా పదుకొణేను అభివర్ణించాడు. ఇక ఇంతకంటే మచ్ బిగ్గర్‌గా కల్కి పార్ట్ 2 రాబోతోందని చెప్పుకొచ్చాడు.












Click it and Unblock the Notifications