స్వీటీ వేచి ఉండలేకపోతున్నా..అనుష్కపై ప్రభాస్ సంచలన పోస్ట్
హీరోయిన్ అనుష్క శెట్టి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతి తక్కువ కాలంలోనే అనుష్క తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. తెలుగులో స్టార్ హీరోలందరితోనూ నటించి ఫుల్ పాపులారిటీని సంపాదించుకుందామె. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. ముఖ్యంగా అరుంధతి సినిమాతో అనుష్క రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. తెలుగులో హీరోలతో సమానంగా అనుష్కకు మార్కెట్ ఉందంటే అతిశేయోక్తి కాదు.
అయితే గత కొంతకాలంగా అనుష్క సినిమాలు చేయడం తగ్గించేసిందనే చెప్పాలి. 'జీరో సైజ్' సినిమాతో లావు పెరిగిన అనుష్క తర్వాత బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేసింది. దాదాపు 100 కేజీలకు పైగా బరువు పెరిగి షాకిచ్చింది. ఆ వెంటనే 'నిశ్శబ్దం' సినిమా కోసం బరువు తగ్గి మాములు స్థితిలోకి వచ్చింది. ఇక యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో అనుష్క ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ఆ తరువాత మరే సినిమాను అనుష్క అంగీకరించలేదు. ఇదిలా ఉంటే అనుష్క పెళ్లికి సంబంధించి ఇప్పటికే చాలానే రూమర్స్ తెర మీదకు వచ్చాయి. హీరో ప్రభాస్‌తో అనుష్క ప్రేమలో ఉందని వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ చాలానే కథనాలు వెలుగులోకి వచ్చాయి.అయితే అవన్నీ కూడా కూడా ప్రచారాలకు మాత్రమే పరిమితం అయ్యాయి.

తమ బంధాన్ని అలాగే కొనసాగిస్తున్నారు ఈ జంట. తాజాగా ప్రభాస్ పోస్ట్ చేసిన పోస్ట్‌తో ఇది మరోసారి రుజువు అయింది. అనుష్క తాజాగా నటించిన చిత్రం 'ఘాటి'. ఈ సినిమా రేపు(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుంది. సినీ ప్రముఖులు అనుష్క సినిమాకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. అనుష్క సినిమాపై ప్రభాస్ సైతం రియాక్ట్ అయ్యారు.
ఘాటి ట్రైలర్ అద్భుతంగా ఉంది. మీ పవర్ ఫుల్ లుక్ ఆకట్టుకుంది.సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. మూవీ టీమ్ కు నా శుభాకాంక్షలు అంటూ ప్రభాస్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications