టాయ్‌లెట్‌లో చేతులు పెట్టి మోహన్‌బాబు చెక్ చేస్తాడు!

లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ బ్యానరుపై పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు బెల్లంకొండ సురేష్. తెలుగు సినీ పరిశ్రమకు మంచి చిత్రాలను అందించిన ఆయన కొంతకాలం విరామం తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఇద్దరు కుమారులు బెల్లంకొండ సాయిశ్రీనివాస్, గణేష్ హీరోలుగా ఉన్నారు. మళ్లీ వరుసపెట్టి సినిమాలు తీయాలని బెల్లంకొండ సురేష్ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ తన కెరీర్ కు సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు. మోహన్ బాబు శ్రీ విద్యానికేతన్ లో అవకతకవలు చోటుచేసుకుంటున్నాయని ఆయన చిన్నకుమారుడు మనోజ్ ఆరోపిస్తున్నారు. అయితే అతను చెప్పింది నిజమేనా అని తెలుసుకోవడానికి ఇటీవలే నిర్మాత బెల్లంకొండ సురేష్ కొన్ని విషయాలు చెప్పారు.

భోజనం అద్భుతంగా ఉంటుంది
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనకు గురువుగారని చెప్పారు. తిరుపతిలో స్కూల్ పెట్టిన తర్వాత అది ఇంతింతై వటుడింతై అన్నట్లుగా డీమ్డ్ యూనివర్సిటీ స్థాయికి ఎదిగిందన్నారు. విద్యార్థులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్ చాలా అద్భుతంగా ఉంటాయన్నారు. ఉదయం టిఫిన్ లో ఇడ్లీ, దోశ, బ్రెడ్, ఆమ్లెట్, ఉప్మా.. తదితర వంటకాలు ఉంటాయన్నారు. అవన్నీ బాగున్నాయా? రుచికరంగా ఉన్నాయా? అని కచ్చితంగా చెక్ చేస్తారు. యూనివర్సిటీని శుభ్రంగా ఉంచే విషయంలో ప్రతి విషయాన్ని చాలా గట్టిగా పట్టించుకుంటారు. చివరకు బాత్ రూమ్స్ ఎలా ఉన్నాయనే విషయాన్ని ఆయన స్వయంగా లోపలికి వెళ్లి పరిశీలిస్తారని బెల్లంకొండ సురేష్ చెప్పారు.

producer bellamkonda suresh interesting comments on mohanbabu and his university

చేత్తో తాకి చూస్తాడు
టాయ్ లెట్స్ ను చేత్తో తాకి కూడా చూస్తారని, శుభ్రతకు అంత ప్రాధాన్యత ఇస్తారన్నారు. నాణ్యమై విద్యతోపాటు మంచి ఆహారం, పరిశుభ్రమైన వాతావరణం, క్రమశిక్షణ ఉండటంతోనే అది ఈరోజు ఇంత భారీ స్థాయికి చేరిందని సురేష్ చెప్పారు. మనోజ్, మోహన్ బాబు ఒకరిపై మరొకరు భౌతిక దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు దగ్గర ఉన్న రెండు లైసెన్స్ డ్ తుపాకీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన పుట్టినరోజు కావడంతో కేక్ కట్ చేయించి గదిలో సామాన్లు ఎత్తుకుపోయాడంటూ మనోజ్ తల్లి నిర్మల అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదం భవిష్యత్తులో మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+