మెగా అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పిన అల్లు అర్జున్ నిర్మాత
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుప్ప-2 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు టాలెంటెడ్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. పుష్ప మొదటి పార్ట్ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ముఖ్యంగా పుష్ప సినిమాకు బాలీవుడ్ ఫిదా అయింది. సుకుమార్ టేకింగ్, అల్లు అర్జున్ స్టైలిష్ యాక్టింగ్‌కు బాలీవుడ్ జనాలు నీరాజనం పట్టారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా రూ.200 కోట్ల రూపాయిలకు పైగానే కలెక్ట్ చేసింది.
ఈ సినిమాకు కొనసాగింపుగా పుప్ప-2 తెరకెక్కుతోంది. ఆగస్టు 15న విడుదల కావాల్సిన ఈ సినిమా , షూటింగ్ ఆలస్యం కావడంతో చిత్ర యూనిట్ డిసెంబర్‌కు వాయిదా వేశారు.అయితే పవన్ కల్యాణ్‌కు భయపడే సినిమాను వాయిదా వేసుకున్నారంటూ మెగా అభిమానులు తెగ ప్రచారం చేసుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా అల్లు అర్జున్ పుప్ప-2 గెటప్ నుంచి బయటకు వచ్చేశారు. ఓ విమానంలో అల్లు అర్జున్ గెడ్డం లేకుండా కనిపించారు. దీంతో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌ల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయని, అందుకే అల్లు అర్జున్ పుప్ప-2 సినిమా నుంచి బయటకు వచ్చేశారంటూ ప్రచారం జరుగుతోంది.

ముఖ్యంగా మెగా అభిమానులు అల్లు అర్జున్‌ను ఈ విషయంలో ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు.అయితే తాజాగా దీనిపై అల్లు కాంపౌండ్‌కు సంబంధించిన వ్యక్తి క్లారిటీ ఇచ్చారు.అల్లు అర్జున్ సన్నిహితుడు, ప్రముఖ నిర్మాత బన్నీవాస్ శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో దీనిపై క్లారిటీ ఇచ్చారు. పుష్ప-2 గురించి మీడియాలో వస్తున్న న్యూస్‌లు చూసి నవ్వుకునే స్థితిలో మేమున్నామని ఆయన తెలిపారు.
అల్లు అర్జున్ షూటింగ్ పార్ట్ 15 నుంచి 20రోజుల వరకు ఉండగా.. వేరే ఆర్టిస్టులతో కూడా చిత్రీకరణ మిగిలి ఉంది. దర్శకుడు సుకుమార్ ఎడిటింగ్ చూసుకుని ఇంకా ఏమైనా అల్లు అర్జున్ పార్ట్ బ్యాలెన్స్ ఉందేమో క్లారిటీ తెచ్చుకుని షూటింగ్ పెట్టుకుందాం అన్నారు. అల్లు అర్జున్ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని గడ్డం ట్రీమ్ చేశారు. అల్లు అర్జున్ సుకుమార్‌కు నాకు ఉన్న బాండింగ్ లైఫ్ లాంగ్ అలానే ఉంటుంది. ఆగస్టు మొదటి వారంలో షూటింగ్ మొదలవుతుందని బన్నీవాస్ క్లారిటీ ఇచ్చారు. . పుష్ప-2 షూటింగ్‌పై బన్నీవాస్ క్లారిటీ ఇవ్వడంతో మెగా అభిమానులు చేసిన ప్రచారం తప్పని తేలిపోయింది.












Click it and Unblock the Notifications