చిరంజీవి ఏం మాట్లాడారు?: తప్పుడు వార్తలు రాస్తే తాట తీస్తానంటూ దిల్ రాజ్ స్ట్రాంగ్ వార్నింగ్
ఇటీవల తనపై వస్తున్న విమర్శలపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు తీవ్రంగా స్పందించారు. ప్రతి సంక్రాంతికి ఏదో రకంగా తనపై విమర్శలు చేస్తున్నారని.. ఇకపై తనపై తప్పుడు వార్తలు రాసే వెబ్‌సైట్‌ల తాటతీస్తానని దిల్ రాజు హెచ్చరించారు. సోమవారం హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో ఆయన ఈ విషయం గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. అసత్య వార్తలు రాస్తున్న వెబ్‌సైట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇండస్ట్రీలో పక్కన ఉంటూనే మనపై రాళ్లు వేస్తారు. ప్రతి సంక్రాంతికి సినిమాలు విడుదలవుతుంటాయి. ఏదో ఒక రకంగా నాపై ప్రతీ సంక్రాంతికి విమర్శలు చేస్తున్నారు. చిరంజీవి నాపై మాట్లాడిన మాటలకు కొన్ని వెబ్ సైట్లు తప్పుగా వక్రీకరించాయి. నాపై తప్పుడు వార్తలు రాస్తే వెబ్ సైట్ల తాటతీస్తాను అంటూ దిల్ రాజు హెచ్చరించారు.

వ్యాపార పరంగా వచ్చే విమర్శలను వాళ్లకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఈ రోజు నుంచి ఊరుకునే ప్రసక్తే లేదు. ఆ తమిళ సినిమాను నేనే వాయిదా వేశాను. హను-మాన్ సినిమా విడుదల చేయాలని నేనే చెప్పాను. నైజాంలో హనుమాన్ , గుంటూరు కారం సినిమాలకు థియేటర్లు ఉన్నాయి. నాగార్జున, వెంకటేశ్ సినిమాలకు థియేటర్లు దొరకడం లేదు. తప్పుడు రాతలతో ఏం చేద్దామనుకుంటున్నారు. నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను. మీ వైబ్ సైట్ల, యూట్యూబ్ ఛానల్స్ వ్యూస్ కోసం నా పేరు వాడుకుంటే ఊరుకునేది లేదు అంటూ విమర్శకులకు దిల్ రాజు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
So satisfying…
— Deadpool Reddy (@Deadpool_Reddy) January 8, 2024
Dil Raju slipper shot to Blue and Yellow paid dogs @greatandhranews @Telugu360 🦮 pic.twitter.com/GNyyjWhj4e
తనను కలిసి సినిమాల విడుదలపై చర్చించామని చిరంజీవి మంచిగా చెబితే.. ఇష్టంవచ్చినట్లు రాస్తున్నారని దిల్ రాజు మండిపడ్డారు. ఏమీ తెలియకుండా తనపై తప్పుడు వార్తలు రాస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా దిల్ రాజు కొంత భావోద్వేగానికి గురయ్యారు. కాగా, గతంలో చిన్న సినిమాను సంక్రాంతి సందర్భంగా దిల్ రాజు విడుదల చేశారని, అది హిట్టయ్యిందని.. ఇప్పుడు హనుమాన్ కూడా హిట్ అవుతుందని చిరంజీవి ప్రీ రిలీజ్ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications