Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్ కల్యాణ్ బెదిరింపులకు బయపడని ఏకైక నిర్మాత ఆయనే..!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'హరి హర వీరమల్లు' సినిమా వచ్చే నెల 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఎవరూ ఊహించని విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్ అని ప్రకటించారు. జూన్ 1 నుంచి రెండు రాష్ట్రాల్లో థియేటర్లను బంద్ చేస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు ప్రకటించారు. అయితే సరిగ్గా పవన్ కల్యాణ్ సినిమా విడుదలకు ముందు ఇలా థియేటర్ల బంద్ అని ప్రకటించడం సంచలనంగా మారింది. థియేటర్ల బంద్ వెనుక 'ఆ నలుగురు' నిర్మాతలంటూ ప్రముఖ మీడియా సంస్థలు కూడా పలువురి పేర్లను తెర మీదకు తీసుకువచ్చాయి.

సరిగ్గా ఇదే సమయంలో పవన్ కల్యాణ్ కూడా సినిమా ఇండస్ట్రీకి గట్టి ఝలక్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సినీ పెద్దలు ఎవ్వరూ కూడా మర్యాదపూర్వకంగా సీఎం చంద్రబాబును కలిసింది లేదంటూ ఇండస్ట్రీని ఉద్దేశించి లేఖ విడుదల చేశారు. మీకు అన్ని విధాలుగా అండగా ఉన్న ప్రభుత్వ పెద్దను కలవకపోవడాన్ని పవన్ తప్పు పట్టారు.పవన్ లేఖతో ఇండస్ట్రీలో గుబులు మొదలైంది.దీంతో థియేటర్ల బంద్ వెనుక ఎవరున్నారనే చర్చ తెర మీదకు వచ్చింది. ముఖ్యంగా దీని వెనుక దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు వంటి నిర్మాతల పేర్లు తెర మీదకు వచ్చాయి.

Producer Suresh Babu does not respond to the theaters bandh controversy

ఇప్పటికే అల్లు ,మెగా ఫ్యామిలీల మధ్య విభేదాలు చోటు చేసుకోవడంతో అల్లు అరవింద్ పాత్ర ఉందనే ఆరోపణలు బలంగా వినిపించాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అల్లు అరవింద్ మీడియా సమావేశం నిర్వహించి దీనిపై క్లారిటీ ఇచ్చారు. థియేటర్ల బంద్‌కు తనకు ఎటువంటి సంబంధం లేదని ఆయన తెలిపారు. తనకు 15 మించి థియేటర్లు కూడా లేవని వివరణ ఇచ్చారు. అలాగే దిల్ రాజు సైతం తనపై వచ్చిన ఆరోపణలపై సమాధానం ఇచ్చారు. పవన్ కల్యాణ్ సినిమాను ఆపే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదంటూ దిల్ రాజు చెప్పుకొచ్చారు.

జనసేన నేత అత్తి సత్యనారాయణ అనే వ్యక్తి వల్లే ఇదింతా జరిగిందని చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో జనసేన పార్టీ నుంచి అత్తి సత్యనారాయణను సస్పెండ్‌ చేస్తూ పవన్ కల్యాణ్ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ ఎపిసోడ్ మొత్తంలో కూడా ఈ ఘటనపై స్పందించని వ్యక్తి ఎవరైనా ఉన్నారా..? అంటే అది కచ్చితంగా నిర్మాత సురేష్ బాబే. సురేష్ బాబు ప్రొడక్షన్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన చేతిలో కూడా థియేటర్లు ఉన్నాయి. థియేటర్ల బంద్ వెనుక ఆయన పేరు కూడా తెర మీదకు వచ్చింది. అయినప్పటికీ అల్లు అరవింద్ , దిల్ రాజుల మాదిరిగా సురేష్ బాబు బయటకు వచ్చి మీడియా సమావేశం నిర్వహించలేదు. చివరకు ఈ ఘటనపై ఆయన రియాక్ట్ అయింది కూడా లేదు.

దీంతో ఆయన ధైర్యంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. గతంలో మాదిరిగా సురేష్ బాబు సినిమాలను నిర్మించడం లేదు. పైగా డిస్ట్రిబ్యూటింగ్‌కు కూడా ఆయన దూరంగా ఉంటున్నారు. దీంతో తన పాత్రలేని ఇష్యూపై తాను ఎందుకు స్పందించాలని సురేష్ బాబు భావించినట్టు తెలుస్తోంది. అందుకే ఆయన ఈ వివాదంపై స్పందించలేదని సమాచారం. ఆయన గత వైసీపీ ప్రభుత్వం సమయంలో టికెట్లు వివాదం వచ్చినప్పుడు కూడా అవసరం అయితే సినిమాలను తీయడం మానేస్తానేమో కానీ, ఎవర్నీ కలవనని తేల్చి చెప్పారు. ఇప్పుడు కూడా ఆయన వైఖరితో ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకే పవన్ కల్యాణ్ లేఖ తర్వాత కూడా సురేష్ బాబు రియాక్ట్ కాలేదు.మొత్తానికి ఈ వివాదంలో తన పేరు వచ్చినప్పటికీ, స్పందించని వ్యక్తిగా నిర్మాత సురేష్ బాబు నిలిచారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+