ఆ రికార్డును టచ్ కూడా చేయలేకపోయిన 'పుష్ప2'!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన పుష్ప2 చిత్రం సంచలన రికార్డులు సాధిస్తూ ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతోంది. ఈ సినిమా ఇప్పటికే రూ.1700 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. తర్వాత బాహుబలి2, దంగల్ రికార్డులను బద్దలు కొట్టడమే తరువాయి. బాహుబలి2 రూ.1850 కోట్లవరకు రాబట్టగా, దంగల్ సినిమా చైనాలో వచ్చిన కలెక్షన్లను కలిపి రూ.2వేల కోట్లు రాబట్టింది. కొత్త సంవత్సరంతోపాటు సంక్రాంతి సెలవులు కూడా ఉండటంతో అవలీలగా ఈ రెండు సినిమాల రికార్డులను మరో రూ.10 కోట్లకు మించి వచ్చే అవకాశం లేదు పుష్ప2 దాటేస్తుందని అంచనా వేస్తున్నారు.
మొత్తంగా రూ.2200 కోట్లు వసూలు చేయొచ్చని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ సినిమా ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డును మాత్రం టచ్ కూడా చేయలేకపోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ సినిమా రూ.270 కోట్లకు పైగా షేర్ కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టించింది. కల్కి, సలార్ చిత్రాలు కూడా ఈ రికార్డును అందుకోలేకపోయాయి. దేవర సైతం అందుకోలేదు. ఏపీ, తెలంగాణలో పుష్ప2కు రూ.210 కోట్ల షేర్ వచ్చింది. రాబోయే కలెక్షన్లు కలుపుకున్నా మరో రూ.10 కోట్లకు మించి రావని భావిస్తున్నారు. అంటే ఆర్ఆర్ఆర్ చిత్రానికి రూ.50 కోట్ల దూరంలోనే ఆగిపోయే అవకాశం కనపడుతోంది. హిందీలో కూడా మంచి జోరు చూపిస్తున్న పుష్ప2 కూడా ఇంత షేర్ రాబట్టేకపోతోందంటే భవిష్యత్తులో ఏ సినిమాకైనా కష్టమే అంటున్నారు.

మహేష్ బాబు, పవన్ కల్యాణ్.. వీరిద్దరికే
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కు సూపర్ హిట్ టాక్ వచ్చినా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.200 కోట్ల షేర్ రాబట్టే అవకాశం ఉందంటున్నారు. అంతకుమించి వచ్చే అవకాశం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డును బద్ధలు కొట్టాలంటే కనీసం రూ.50 రోజులు హౌస్ ఫుల్స్ తో నడవాలి. అప్పుడే ఆ షేర్ ను అందుకుంటారు. ప్రస్తుతం దీన్ని బద్దలుకొట్టే హీరో ఎవరు అనే ప్రశ్న తలెత్తుతోంది. రాజమౌళి-మహేష్ బాబు కాంబోలో వస్తున్న సినిమాకు అవకాశం ఉందంటున్నారు. అలాగే పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లుకానీ, ఓజీకికానీ అవకాశం ఉండొచ్చంటున్నారు. అంతకుమించి ఆర్ఆర్ఆర్ షేర్ ను మరే హీరోకానీ, సినిమాకానీ అందుకునే అవకాశం లేదని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు.












Click it and Unblock the Notifications