ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టం.. మీ ఇష్టం: పుష్ప2 నిర్మాతలు?
క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం పుష్ప2. దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా? అనే ఆసక్తితో ఉన్నారు. వాస్తవానికి వచ్చే నెల 15వ తేదీనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నప్పటికీ పవన్ కల్యాణ్ అభిమానులతో అల్లు అర్జున్ కు వివాదం ఏర్పడటంతో.. ఇటువంటి సమయంలో సినిమాను విడుదల చేస్తే నష్టపోతామనే ఉద్దేశంతో నిర్మాతలు డిసెంబరు ఆరోతేదీకి విడుదలను వాయిదా వేశారు.
మళ్లీ తీస్తున్న సుకుమార్
ఈ సమయంలో సినిమాలో సరిగా రాన్ని సన్నివేశాలను మరింత బాగా తీయాలని దర్శకుడు సుకుమార్ కొన్నింటిని రీషూట్ చేస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో నటుల నుంచి సరైన సహకారం రాకపోతుండటంతో ఆయన తీవ్ర ఆగ్రహానికి, అసహనానికి గురవుతున్నారు. మరోవైపు అల్లు అర్జున్ సాధ్యమైనం త్వరగా సినిమాను విడుదల చేయండి అంటూ దర్శకుడితోపాటు నిర్మాతలపై కూడా ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఇంతవరకు ఈ సినిమాలో ఐటం సాంగ్ కూడా చిత్రీకరణకు నోచుకోలేదు. ఈ పాటను జాన్వీకపూర్ చేత చేయించాలనేది సుకుమార్ ఆలోచన.

తడిసి మోపెడవుతోన్న ఖర్చు
ఇటువంటి పరిస్థితుల మధ్య సినిమాలో సన్నివేశాలను తీయడానికి ఖర్చు అవుతుంది. వీటికితోడు నటుల కాల్షీట్లు మళ్ల అవసరమవుతుంటాయి. దీనివల్ల ఖర్చు తడిసి మోపెడవుతోంది. దీంతో నిర్మాతలు అల్లు అర్జున్ తోపాటు దర్శకుడు సుకుమార్ కు కూడా ఒక విషయంలో స్పష్టత ఇచ్చారు. ఇప్పటికే ఈ సినిమాకు అనుకున్న బడ్జెట్ ను మించి రూ.400 కోట్ల వరకు ఖర్చు చేశామని, తాము ఎంతవరకైతే బడ్జెట్ ను కేటాయించామో.. అంతవరకే, అంత పరిమితిలోనే షూటింగ్ ను పూర్తిచేయాలని సుకుమార్ కు ఖరాఖండిగా చెప్పేశారు. దీంతో ఏమీ అర్థంకాని స్థితిలో సుకుమార్ పడిపోయారు. ప్రస్తుతం ఆయన షూటింగ్ చేయడంలేదు. అమెరికాలో ఉన్నారు. వచ్చిన తర్వాతే తిరిగి షూటింగ్ ప్రారంభం కాబోతోంది.












Click it and Unblock the Notifications