పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల పై..రాజ్ తరుణ్ గర్ల్ ఫ్రెండ్ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. లావణ్య అనే యువతి హీరో రాజ్ తరుణ్ తనని మోసం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్‌తో 11 ఏళ్ల నుంచి రిలేషన్ ఉన్నానని ..తామిద్దరం గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని చెప్పి పెద్ద షాకిచ్చింది. మధ్యలో ఓ హీరోయిన్ రావడంతో ఆమెతో ఎఫైర్ పెట్టుకుని వెళ్లిపోయాడని చెప్పుకొచ్చింది. రాజ్ తరుణ్ నాకు కావాలని తాను ఆయనతోనే ఉండాలని కోరుకుంటానని లావణ్య స్పష్టం చేసింది.
లావణ్య చేసిన ఆరోపణలపై తాజాగా రాజ్ తరుణ్ స్పందించారు. నేను ఒకప్పుడు లావణ్యతో రిలేషన్‌తో ఉన్న మాట వాస్తవమేనని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు. అయితే 2016-17 తర్వాత ఆమెతో తనకు ఎటువంటి శారీరక సంబంధం లేదని రాజ్ తరుణ్ క్లారిటీ ఇచ్చారు. ఆమె వ్యక్తిత్వం మంచిది కాదనే దూరంగా ఉన్నానని, ఇండస్ట్రీలో ఉన్న నాకున్న పరువు పోతుందనే ఇన్నాళ్లు తాను సైలెంట్‌గా ఉన్నానని రాజ్ తరుణ్ తెలిపారు.

ఇండస్ట్రీలో కష్టపడి ఈ స్థాయికి వచ్చానని.. ఆమె ప్రతి విషయానికి బెదిరించేదని.. అందుకే లావణ్య నుంచి దూరంగా ఉంటున్నానని రాజ్ తరుణ్ క్లారిటీ ఇచ్చారు. లావణ్య , మస్తాన్ అనే వ్యక్తితో రిలేషన్‌లో ఉందని, వారిద్దరూ రూంలో కలిసి ఉన్నప్పుడు తాను చూశానని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు. లావణ్య మరోసారి రాజ్ తరుణ్‌పై ఆరోపణలు చేసింది. రాజ్ తరుణ్‌కు చాలా మంది అమ్మాయిలతో రిలేషన్స్ ఉన్నాయని తెలిపింది. దీనిలో భాగంగానే బిగ్ బాస్ బ్యూటీ అరియానాతో రాజ్ తరుణ్ ఎఫైర్ నడిపాడాని ఆరోపణలు చేసింది.
వీరిద్దరు కాల్ చేసుకుని మాట్లాడుకునేవారని , ఈ విషయం నటుడు రాజా రవీంద్రకు కూడా తెలుసునని ఆమె చెప్పుకొచ్చింది. తాజాగా మీడియాతో ఆమె మాట్లాడుతూ.. తాను పవన్ కల్యాణ్‌కు పెద్ద ఫ్యాన్‌నని, ఆయన సినిమా విడుదలైన మొదటి రోజు మొదటి షో చూస్తానని.. అలాగే నా కారు వెనుక పవన్ కళ్యాణ్ స్టిక్కర్ తప్పనిసరిగా ఉంటుందని చెప్పుకొచ్చింది. అందుకే న్యాయం కోసం నేను ఆయన వద్దకే వెళ్తానని లావణ్య తెలిపింది.
న్యాయం కోసం పవన్ కళ్యాణ్‌ను కలుస్తానన్న లావణ్య .. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల పై కూడా షాకింగ్ కామెంట్స్ చేసింది పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇక తన ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చినప్పటికీ వారిని ఆయన కలిసినప్పుడు ఏ విధమైనటువంటి లోటు లేకుండా చూసుకున్నారని లావణ్య పేర్కొంది. కానీ రాజ్ తరుణ్ అలాంటి వ్యక్తి కాదని, కనీసం నేను భోజనం చేయడానికి కూడా డబ్బులు ఇవ్వడని ఆమె ఆరోపించింది. ఏపీలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్‌ను కలిసి తనకు న్యాయం జరిగిలే చూడాలని కోరాతానని లావణ్య తెలిపింది.












Click it and Unblock the Notifications