రాజమౌళి తదుపరి చిత్రం ఎవరితోనో తెలిసిపోయింది..?

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్ లు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడమే కాకుండా చిత్ర పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి కాంబినేషన్ లో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకటి. ఈ మోస్ట్ పవర్ ఫుల్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానున్నట్లు స్పష్టం అవుతోంది. ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేశ్ బాబుతో వారణాసి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం భారతీయ సినీ ఇండస్ట్రీలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఇది టాప్​ ప్లేస్​ లో ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 07న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. దాదాపు రూ. 1200 కోట్ల బడ్జెట్‌ తో ఈ సినిమా రూపొందుతోంది.

అటు మెగా పవర్ స్టార్ ప్రస్తుతం పెద్ది విజయోత్సవంలో ఉన్నారు. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా జూన్ 4 న పెద్ది మూవీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. రూ. 400 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇటీవల కొన్ని సీన్స్ యాడ్ చేసిన క్రమంలో రానున్న రోజుల్లో మరిన్ని కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే పెద్ది సినిమా తర్వాత రామ్ చరణ్.. సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.

ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ఏడాది చిత్రీకరణ స్టార్ట్ కానుంది. సుకుమార్ పుష్ప 2, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమా తర్వాత వస్తున్న క్రేజీ కాంబో కావడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన రంగస్థలం మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ తర్వాత రామ్ చరణ్- రాజమౌళి మూవీ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Rajamouli and Ram Charan to Collaborate Again Another Film Confirmed in the Works Rajamouli Charan

ఇక గతంలో రామ్ చరణ్- రాజమౌళి కాంబోలో వచ్చిన మగధీర మూవీ ఎంతటి ఘనవిజయం సాధించిందో మనకు తెలిసిందే. ఈ మూవీ అప్పటివరకూ ఉన్న తెలుగు చలనచిత్ర రికార్డుల్ని తిరగరాసింది. ఆ తర్వాత వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ సైతం ప్రపంచవ్యాప్తంగా విశేష స్పందన లభించింది. ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 1200 కోట్లకుపైగా కలెక్షన్స్ వచ్చాయి. దాంతో ముచ్చటగా మూడోసారి ఈ క్రేజీ కాంబో రిపీట్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ 'గరుడ'ను రామ్ చరణ్ తో తీయబోతున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+