రాజమౌళి-పవన్ కల్యాణ్ కాంబినేషన్‌లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?
దర్శకుడు ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా వరుస సినిమాలు హిట్ కొడుతున్న దర్శకుడు ఆయన. రాజమౌళి పేరు చెప్పగానే తెలుగు ఇండస్ట్రీ బాక్సాఫీస్ రికార్డుల గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా బాహుబలి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన దర్శకుడు. అలాంటి దర్శకుడుతో సినిమా చేయాలని ఏ హీరో అయిన కలలు కంటారు. కానీ రాజమౌళి సినిమాలో నటించే అవకాశం వచ్చిన , చేయని హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది కచ్చింతంగా పవన్ కల్యాణే.
అవును రాజమౌళి, పవన్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కాల్సి ఉంది. అయితే రాజమౌళితో సినిమా చేయడానికి పవన్ కల్యాణ్ ఆసక్తి చూపించకపోవడంతో ఆ సినిమాలో మరో హీరోను పెట్టి హిట్ కొట్టాడు రాజమౌళి. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు విక్రమార్కుడు. మాస్ మహారాజా రవితేజ, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమాలో అనుష్క శెట్టి హీరోయిన్‌గా నటించింది. అజయ్, వినీత్ కుమార్, రాజీవ్ కనకాల, రుతిక తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు.ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. తొలి ఆట నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. డ్యూయల్ రోల్‌లో రవితేజ ఎనర్జిటిక్ యాక్టింగ్, అనుష్క పర్ఫామెన్స్, సాంగ్స్ మూవీకి హైలెట్‌గా నిలిచాయి. రూ. 11 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన విక్రమార్కుడు.. ఫుల్ రన్ లో రూ. 19 కోట్ల రేంజ్ లో వసూళ్లను రాబట్టింది. అటు నిర్మాతలకు, ఇటు బయ్యర్లకు అదిరిపోయే లాభాలను తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో రవితేజ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. మొదట ఈ సినిమాను పవన్ కల్యాణ్‌తో తీయాలని రాజమౌళి ప్రయత్నించినప్పటికి అది సాధ్యం కాకపోవడంతో , రవితేజతో తీసి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు.












Click it and Unblock the Notifications