ఆ టాలీవుడ్ స్టార్ హీరోకి ఎంత ఆస్తి ఉందో తెలిస్తే మైండ్ బ్లాంకే !!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. టాలీవుడ్ లో స్టార్ హీరోగా దూసుకుపోతుండగా.. రాజమౌళి దర్శకత్వంలో నటించిన "ఆర్ఆర్ఆర్" చిత్రంతో గ్లోబల్ వైడ్ గా ఫ్యాన్స్ ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో "దేవర" చిత్రంతో సాలిడ్ హిట్ అందుకున్నారు.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో "డ్రాగన్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. అలానే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. #NTRxTrivikram అనే వర్కింగ్ టైటిల్ తో ఓ పోస్టర్ ను పంచుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను సితార ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మించనున్నారు.

ఫిల్మ్ కెరీర్..
కాగా 1983 మే 20న హరికృష్ణ, శాలిని దంపతులకు జన్మించిన ఎన్టీఆర్ చిన్ననాటి నుంచే కళల పట్ల ఆసక్తి కనబరిచారు. ముఖ్యంగా కూచిపూడి, క్లాసికల్ డ్యాన్స్‌లలో శిక్షణ పొంది అద్భుత ప్రతిభను చాటుకున్నారు. కేవలం 13 ఏళ్ల వయసులో దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన "బాల రామాయణం"లో రాముడి పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన Student No. 1 ద్వారా హీరోగా పరిచయమయ్యారు. తొలి చిత్రంతోనే ఎనర్జిటిక్ హీరోగా గుర్తింపు తెచ్చుకొని.. ఆ తర్వాత వరుస విజయాలతో టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగారు.
మాస్ హీరోగా మాత్రమే కాకుండా వైవిధ్య పాత్రల్లోనూ ఎన్టీఆర్ తన నటనను చాటుకున్నారు. టెంపర్, జనతా గ్యారేజ్, అరవింద సమేత వీర రాఘవ వంటి చిత్రాల్లో ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇక RRR లోని కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ చూపించిన నటన అంతర్జాతీయ సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. హాలీవుడ్ దర్శకులు, విదేశీ మీడియా కూడా ఎన్టీఆర్ నటనపై ప్రశంసలు కురిపించాయి. "కొమురం భీముడో" పాటలో ఆయన చూపించిన భావోద్వేగాలు ప్రేక్షకులను కంటతడి పెట్టించాయి.
భారీ ఆస్తులు.. లగ్జరీ లైఫ్‌స్టైల్..
మరోవైపు సినిమాల ద్వారా మాత్రమే కాకుండా బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, వ్యాపార పెట్టుబడుల ద్వారా కూడా ఎన్టీఆర్ భారీ ఆదాయం సంపాదిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.600 కోట్లకు పైగానే ఉంటుందని సినీ వర్గాల అంచనా. ఒక్కో సినిమాకు రూ.45 కోట్ల నుంచి రూ.80 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన విలాసవంతమైన భవనం విలువ దాదాపు రూ.25 కోట్లుగా చెబుతున్నారు. ఇవే కాకుండా ఆయన వద్ద లాంబోర్గిని, రేంజ్ రోవర్, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. అంతేకాకుండా సుమారు రూ.80 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ కూడా ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications