S. S. Rajamouli: దర్శకధీరుడికీ తప్పట్లేదుగా.. వీడియో వైరల్..
దర్శక ధీరుడు రాజమౌళి భారతీయ చలనచిత్ర పరిశ్రమలో గర్వించదగ్గ డైరెక్టర్స్ లో ఒకరు. బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ సినిమాలతో ఆయన ఖ్యాతి ప్రపంచదేశాలకు పాకింది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో 'వారణాసి' అనే గ్లోబల్ ఎడ్వెంచర్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తయింది. మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో నటిస్తోంది. ఇక మలయాళం స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ నెగిటివ్ రోల్ లో కనిపించనున్నారు.
అదే విధంగా సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ సైతం ఈ మూవీలో కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత కే ఎల్ నారాయణ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక వారణాసి మూవీ 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు- రాజమౌళి కాంబోలో వస్తున్న తొలి మూవీ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే రాజమౌళి తన ఫ్యామిలీతో ఎంత క్లోజ్ గా ఉంటారో మనం ఇప్పటికే చాలాసార్లు చూశాం. రాజమౌళి సినిమాలో ఆయన ఫ్యామిలీ మొత్తం పనిచేస్తుందన్న సంగతి తెలిసిందే.

ఇక రాజమౌళి సతీమణి రమా రాజమౌళి ప్రస్తుతం కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. రాజమౌళి ప్రతి సినిమాకు ఆమెనే కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తారు. ముఖ్యంగా ఈగ, మగధీర, బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాల్లో ఆమె పనితనం స్క్రీన్ పై కనిపిస్తుంటుంది. అయితే రాజమౌళి దంపతుల కుమారుడు కార్తికేయ నిర్మాతగా మారారు. ఇటీవల డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ అనే సినిమా చేశారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అయితే ఈ ఈవెంట్ ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే సినిమా సెట్స్ లో నటీనటులపై అరుస్తూ ఎంతో గంభీరంగా కనిపించే రాజమౌళి.. ఇంట్లో మాత్రం అందరిలాగే సాధారణ భర్తేనని చెప్పక తప్పదు.
Rajamouli & Rama’s Funny Moment!
— Telangana Ahead (@telanganaahead) September 30, 2026
A fun moment between SS Rajamouli and Rama Rajamouli has gone viral on social media.#SSRajamouli #RamaRajamouli #ViralVideo pic.twitter.com/kQG3vcs0S8
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళిని అతని సతీమణి రమా రాజమౌళి పదా నడూ అంటూ తీసుకెళ్తున్న విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. రమా రాజమౌళి మాటలతో అక్కడున్న వారంతా నవ్వుకున్నారు.












Click it and Unblock the Notifications
