ఆ హీరో చిరుకు బద్ధ శత్రువు.. అయినా అతని సినిమానే రీమేక్ చేశాడు
తెలుగులో దాదాపు 40 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్ ను కొనసాగిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ క్రమంలో ఎన్నో సంచలన రికార్డులు నమోదు చేయడంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పలు అవార్డులను అందుకున్నారు. మధ్యలో రాజకీయాల్లోకి వెళ్లి వచ్చారు. తన మనస్తత్వానికి అవి పొసగవని అర్థం చేసుకొని రెండో ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇటీవలే గిన్నిస్ బుక్ లో పేరు నమోదైంది. ఐఫా నుంచి ఔట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్ ఇండియన్ సినిమా అవార్డును సాధించారు. అటువంటి చిరంజీవికి తెలుగులో ఓ స్టార్ హీరోతో పొసగదు. కొన్ని సంవత్సరాల క్రితం ఓ సినిమా విషయంలో రేకెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది.
ప్రతిబంధ్ పేరుతో అడుగు పెట్టారు
చిరంజీవి కథానాయకుడిగా మంచి ఫామ్ లో ఉన్న తరుణంలోనే హిందీలోకి వెళ్లాలనుకున్నారు. అన్ని కథలను పరిశీలించి చివరకు తెలుగులో డాక్టర్ రాజశేఖర్ నటించిన అంకుశం సినిమాను ప్రతిబంధ్ పేరుతో రీమేక్ చేశారు. హీరోయిన్ గా జుహీచావ్లా నటించింది. అల్లు అరవింద్ నిర్మించగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు. రామిరెడ్డి విలన్ గా నటించారు. హిందీలో కూడా ఈ సినిమా పర్వాలేదనిపించుకుంది. ఆ తర్వాత గ్యాంగ్ లీడర్ సినిమాను ఆజ్ కా గూండారాజ్ పేరుతో రీమేక్ చేశారు. దీనికి కూడా రవిరాజా పినిశెట్టి దర్శకుడు. అయితే హిందీలో ఈ సినిమా ఫ్లాపైంది.

ఎవరు బాగా చేశారని పోలిక
శంకర్ దర్శకత్వంలో వచ్చిన జంటిల్ మెన్ చిత్రాన్ని ది జంటిల్ మెన్ పేరుతో హిందీలోకి చిరు రీమేక్ చేశారు. మహేష్ భట్ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించారు. ఈ సినిమాలో కూడా జుహీచావ్లా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కూడా ఆడలేదు. దీంతో హిందీలో సినిమాలు చేయడం ఆపేశారు. చిరంజీవి ప్రతిబంధ్ సినిమా చేసినప్పుడు రాజశేఖర్ బాగా చేశాడా? లేదంటే చిరంజీవి బాగా చేశాడా? అని సినీ విశ్లేషకులు పోల్చిచూశారు. కొందరు రాజశేఖర్ బాగా చేశాడనగా, మరికొందరు చిరంజీవి బాగా చేశాడన్నారు. ఏదేమైనప్పటికీ తనకు బద్ధ శత్రువుగా ఉన్న వ్యక్తి సినిమాతో హిందీ పరిశ్రమలోకి చిరంజీవి అడుగు పెట్టాడని చాలామంది వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications